PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/central-government-narendra-modi6e78d338-d3b7-4274-ac93-e125bbec701f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/central-government-narendra-modi6e78d338-d3b7-4274-ac93-e125bbec701f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని జిల్లాలు దాదాపుగా మునిగిపోయాయి. విజయవాడను వరద ముంచెత్తింది. దాదాపు 20 సంవత్సరాలలో ఎప్పుడు లేనంతగా వరుణుడు విజృంభించాడు. అలాగే లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. వర్షం , వరదలు తగ్గుముఖం పడితే తప్ప అక్కడ పంటల నష్టాన్ని అంచనా వేయలేరు. రెండు రాష్ట్రాలలో భారీ వర్షం , ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పై కేంద్ర ప్రజలు దృష్టి సారించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర హోంశాఖ మంత్రిCENTRAL GOVERNMENT; NARENDRA MODI{#}Koshta;Manam;Prime Minister;Minister;central government;Telangana;revanth;Varsham;Andhra Pradesh;CBN;India;Teluguవరదల్లో చిక్కుకున్న ఆంధ్ర.. కేంద్ర సాయం ఎక్కడ..?వరదల్లో చిక్కుకున్న ఆంధ్ర.. కేంద్ర సాయం ఎక్కడ..?CENTRAL GOVERNMENT; NARENDRA MODI{#}Koshta;Manam;Prime Minister;Minister;central government;Telangana;revanth;Varsham;Andhra Pradesh;CBN;India;TeluguTue, 03 Sep 2024 09:56:18 GMT•20 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత వరద..

* కేంద్రం పరామర్శ తప్ప సహాయం చేయదా..

•ఆంధ్ర ప్రజలకు దిక్కెవరు..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని జిల్లాలు దాదాపుగా మునిగిపోయాయి.  విజయవాడను వరద ముంచెత్తింది. దాదాపు 20 సంవత్సరాలలో ఎప్పుడు లేనంతగా వరుణుడు విజృంభించాడు.  అలాగే లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. వర్షం , వరదలు తగ్గుముఖం పడితే తప్ప అక్కడ పంటల నష్టాన్ని అంచనా వేయలేరు. రెండు రాష్ట్రాలలో భారీ వర్షం , ప్రాణ,  ఆస్తి నష్టం సంభవించడం పై కేంద్ర ప్రజలు దృష్టి సారించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీశారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా ప్రధాని మంత్రి మోడీ ఫోన్లో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం.


అయితే ఇక్కడ కేవలం మాటలతో సరిపెట్టడం తప్ప,   తక్షణం సహాయాన్ని మాత్రం ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యుద్ధ ప్రాతిపదికన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి ఆ భరోసా లభించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకో కేంద్ర ప్రభుత్వంలో మానవీయ కోణం అసలు ఉండడం లేదనే ఆవేదన తెలుగు ప్రజానీకంలో స్పష్టంగా వినిపిస్తోంది. హక్కుగా రావాల్సినవి కూడా కేంద్రం ఇవ్వకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రజానీకం గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలను, అందులోనూ ప్రత్యేకించి ఏపీ విషయంలో కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు.

ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఉంది కానీ అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితులకు అండగా  నిలబడకపోతే ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఎలా ఉంటుంది? అసలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదు.. కనీసం ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలను పట్టించుకోవాలని , వారికి కావలసిన సహాయాన్ని ప్రకటించాలని ప్రజానీకం కోరుతోంది. మరి కేంద్ర పెద్దలు ఎలాంటి చర్యలతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>