MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibc7e0989-b961-455c-9d33-376004b2aa31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevibc7e0989-b961-455c-9d33-376004b2aa31-415x250-IndiaHerald.jpgఈ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించిన చిన్నారి ఇప్పటికే చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్ర‌. ఈ సినిమాలో అక్ష‌య పాత్ర‌లో కనిపించిన ఆ చిన్నారి అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ముంబైకి చెందిన అనుష్క మల్‌హోత్ర టాలీవుడ్లో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. chiranjeevi{#}Chiranjeevi;Tollywood;Cinemaచిరంజీవి కూతురును గుర్తు ప‌ట్టారా... ఛాన్స్ వ‌స్తే టాలీవుడ్‌ను దున్ని ప‌డేస్తుంది... !చిరంజీవి కూతురును గుర్తు ప‌ట్టారా... ఛాన్స్ వ‌స్తే టాలీవుడ్‌ను దున్ని ప‌డేస్తుంది... !chiranjeevi{#}Chiranjeevi;Tollywood;CinemaTue, 03 Sep 2024 13:54:17 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమార్తెగా నటించిన ఓ చిన్నది ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. చిరంజీవి సినిమాలో నటించిన ఆమె ను ఇప్పుడు చూస్తుంటే స్టార్ హీరోయిన్ల కి షాక్ ఇచ్చే అందంతో మెరిసిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ . 2001 అక్టోబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమాకు సినీయ‌ర్ డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరోయిన్ ఆషిమా భ‌ల్ల కూడా నటించింది. ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించిన చిన్నారి ఇప్పటికే చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్ర‌. ఈ సినిమాలో అక్ష‌య పాత్ర‌లో కనిపించిన ఆ చిన్నారి అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ముంబైకి చెందిన అనుష్క మల్‌హోత్ర టాలీవుడ్లో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.


డాడీ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమె పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత చదువు పై దృష్టి పెట్టి ఆ సినిమాలుకు దూరంగా ఉండిపోయింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో దుమ్మురేపుతుంది. అనుష్క మల్‌హోత్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్లో ఇంత యాక్టివ్ గా ఉండే చిన్నది మతిపోగొట్టే పోజులతో కవ్విస్తూ ఉంటుంది. ఈ అమ్మడు ఇప్పటికే లండన్లో హానర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అనుష్క సోషల్ మీడియాలో తన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలు కూడా సెండ్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు చూస్తుంటే అనుష్క ఖచ్చితంగా హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ... ఆమె ఒక్కసారి ట్రై చేస్తే తిరుగులేకుండా మంచి ఛాన్సులు కొట్టేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>