Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9fde3ef-cd71-40d8-85a0-cd8bf07a2fed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9fde3ef-cd71-40d8-85a0-cd8bf07a2fed-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా రూ. కోటి సాయం ప్రకటించాడు. ఈ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.ఈ విషయాన్ని సెప్టెంబర్ 3న తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సృష్టించిన వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని, త్వరలోనే ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుsocialstars lifestyle{#}Godavari River;Yuva;Viswak sen;Tammudu;Thammudu;Event;NTR;Andhra Pradesh;Telangana;Tollywood;Jr NTR;Telugu;september;Mass;Cinema;mediaఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాధితులకు తన వంతు సాయం..!!ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాధితులకు తన వంతు సాయం..!!socialstars lifestyle{#}Godavari River;Yuva;Viswak sen;Tammudu;Thammudu;Event;NTR;Andhra Pradesh;Telangana;Tollywood;Jr NTR;Telugu;september;Mass;Cinema;mediaTue, 03 Sep 2024 14:20:00 GMTవిశ్వక్ సేన్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దాస్ కా ధమ్కీ, గామి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటీకే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఊర మాస్ సినిమాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రాబోతుంది. అయితే విశ్వక్ ముందు నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ ఎన్టీఆర్ అభిమానులని కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు.ఎన్టీఆర్ సినిమాల గురించి పోస్టులు పెడతాడు, ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడతాడు విశ్వక్. దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సందడి చేసాడు. ఎన్టీఆర్ విశ్వక్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ నా తమ్ముడు అని కూడా దగ్గరికి తీసుకొని మరీ మాట్లాడాడు.ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా రూ. కోటి సాయం ప్రకటించాడు. ఈ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.ఈ విషయాన్ని సెప్టెంబర్ 3న తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సృష్టించిన వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని, త్వరలోనే ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఎన్టీఆర్ కోరారు. తారక్ సాయం ప్రకటించిన కొద్దిసేపటికే యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించాడు.తారక్ ను ఎంతో అభిమానించే విశ్వక్సేన్, అతని బాటలోనే సాయం అందించేందుకు ముందుకొచ్చాడు.విశ్వక్ సేన్ ముందు నుంచి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ వస్తున్నాడు. తన ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ని తీసుకురావడం, ఎన్టీఆర్ గురించి రెగ్యులర్ గా మాట్లాడటం చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విశ్వక్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కొన్ని నిమిషాలకే విశ్వక్ సేన్ కూడా ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు చెరో 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు విశ్వక్ తన సోషల్ మీడియా లో ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు వరదల నివారణ చర్యలకు గాను చెరో 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని ప్రకటిస్తున్నాను. వరదల వల్ల ప్రభావితులైన వారికి నా వంతు చిన్న సహాయం ఇది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో విశ్వక్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>