Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----071359f4-3aa9-4222-b5bf-92550b76e868-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----071359f4-3aa9-4222-b5bf-92550b76e868-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. వరదలు ముంచేత్తు ఉండడం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీభత్సమైన వరదలు రావడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇక పెద్దపెద్ద బిల్డింగులు సైతం జలదిబ్బంధంలోకి వెళ్లిపోవడంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. సహాయం చేయండి మహాప్రభో అంటూ పాలకులను వేడుకుంటున్నారు. కొన్నిచోట్ల పాలకులు ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ తగిన చర్యలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాలిటిక్స్{#}House;politics;Government;Teluguవరద రాజాకీయం : ఇదే మంచి ఛాన్స్ అనుకుంటున్న ప్రతిపక్షాలు?వరద రాజాకీయం : ఇదే మంచి ఛాన్స్ అనుకుంటున్న ప్రతిపక్షాలు?పాలిటిక్స్{#}House;politics;Government;TeluguTue, 03 Sep 2024 10:03:00 GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. వరదలు ముంచేత్తు ఉండడం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీభత్సమైన వరదలు రావడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇక పెద్దపెద్ద బిల్డింగులు సైతం జలదిబ్బంధంలోకి వెళ్లిపోవడంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. సహాయం చేయండి మహాప్రభో అంటూ పాలకులను వేడుకుంటున్నారు. కొన్నిచోట్ల పాలకులు ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ తగిన చర్యలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు.


 కొన్నిచోట్ల మాత్రం ఓట్లు వేశారు గెలిపించారు ఇక ప్రజలతో మాకేం పని  అన్నట్లుగానే.. విపత్తు సమయంలో సైతం ఇల్లు దాటకుండా ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నారు కొంతమంది నాయకులు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కూడా ఈ వరద రాజకీయమే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒకవైపు ఎన్నో ప్రాంతాలను వరదలు ముంచెత్తుతూ జనావాసాలు స్తంభించి పోతుంటే.. ఇంకోవైపు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక ప్రతిపక్షాలు ఇదే అదునుగా భావిస్తున్నాయ్. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇక ప్రజల్లోకి వెళుతూ అటు సహాయక చర్యలకు ఎంత మొత్తంలో అందుతున్నాయి అన్న విషయాన్ని ఆరా తీస్తూ.. ప్రజలకు మేమున్నాము భయపడొద్దు అనే భరోసా ఇస్తున్నారు.


 మీరు ఓట్లు వేసి గెలిపించిన వారు కాదు మేమే మీకోసం కష్టపడే ప్రజా నాయకులం అన్న విషయాన్ని అర్థం అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది సరైన సహాయక చర్యలు అందని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను తెరమిదికి తీసుకువస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు ఏ కోరి ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలా చేస్తుందో చూడండి అంటూ.. ప్రభుత్వంపై ప్రజల్లో నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇతర రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావనకు తీసుకువస్తూ.. సొంత రాష్ట్రాల సమయంలో విమర్శలతో ఏకిపారేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఒకవైపు వరదలతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతుంటే.. పాలిటీషియన్స్ మాత్రం వరద రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>