MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69fcac42-6599-4869-b525-a84e7669408a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69fcac42-6599-4869-b525-a84e7669408a-415x250-IndiaHerald.jpgతమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్‌. ఇక ‘జవాన్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని tollywood{#}atlee kumar;January;Darsakudu;Hero;Tamil;Director;News;India;Cinemaఅట్లీ భారీ ప్లాన్.. ఇండియన్ స్క్రీన్ పై ఊహించని మల్టీస్టారర్..!?అట్లీ భారీ ప్లాన్.. ఇండియన్ స్క్రీన్ పై ఊహించని మల్టీస్టారర్..!?tollywood{#}atlee kumar;January;Darsakudu;Hero;Tamil;Director;News;India;CinemaTue, 03 Sep 2024 18:05:00 GMTతమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్‌. ఇక ‘జవాన్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో

 సినిమా అంటే అభిమానులకు ఇక పండగే అనుకోవచ్చు. జవాన్‌ మూవీతో తన సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా చాటిన అట్లీ ఇప్పుడు మరో భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్‌ చేస్తున్నాడు. అటు నార్త్‌, ఇటు సౌత్‌ ఇండస్ట్రీలను కలుపుతూ ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం అగ్ర హీరోలైన సల్మాన్‌ ఖాన్‌, కమల్‌హాసన్‌ను బరిలోకి దించుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ

 సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తమిళ అగ్ర దర్శకుడు అట్లీ ఈ సినిమాకు సంబంధించి సల్మాన్, కమల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో మునుపెన్నడూ చూడని విధంగా భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ అగ్ర దర్శకుడు అట్లీ  సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>