PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/khammam--ponguleti-srinivas-reddy-thummala-nageshwar-rao-batti-vikramarka75a85f65-4fba-4509-9594-e347d98fb3d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/khammam--ponguleti-srinivas-reddy-thummala-nageshwar-rao-batti-vikramarka75a85f65-4fba-4509-9594-e347d98fb3d5-415x250-IndiaHerald.jpgగత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. చెరువుల, కుంటలు వాగులు, వంకలు, డ్యాములు అన్ని నిండిపోయాయి. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీవ్రంగా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్న సందర్భంలో ఖమ్మం జిల్లాలో మాత్రం మరి దారుణంగా తయారైంది. ఖమ్మం జిల్లాను పూర్తిగా వరదలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ కాలనీలు జల నిర్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఏమి చేయలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రెండు రోజులుగా ఇండ్లలోకి నీరు చేరడంతKHAMMAM ; PONGULETI SRINIVAS REDDY; THUMMALA NAGESHWAR RAO; BATTI VIKRAMARKA{#}Pond;Aqua;Bhadradri;srinivas;Reddy;Khammam;Telangana Chief Minister;Telangana;Varsham;Yevaruవరుణ గర్జన.. ఖమ్మంలో ముగ్గురు మంత్రుల తర్జన భర్జన.!వరుణ గర్జన.. ఖమ్మంలో ముగ్గురు మంత్రుల తర్జన భర్జన.!KHAMMAM ; PONGULETI SRINIVAS REDDY; THUMMALA NAGESHWAR RAO; BATTI VIKRAMARKA{#}Pond;Aqua;Bhadradri;srinivas;Reddy;Khammam;Telangana Chief Minister;Telangana;Varsham;YevaruTue, 03 Sep 2024 09:44:16 GMT
-ముగ్గురు మంత్రులున్నా వరద కష్టాలు తీర్చలేరా.?
- ఖమ్మంను అతలాకుతలం  చేసిన వరదలు
- ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు.
- ఎన్నికల ప్రచారం లాగే నాయకులు వస్తున్నారంటూ విమర్శలు.


 గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. చెరువుల, కుంటలు వాగులు, వంకలు, డ్యాములు అన్ని నిండిపోయాయి.  ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీవ్రంగా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్న సందర్భంలో ఖమ్మం జిల్లాలో మాత్రం మరి దారుణంగా తయారైంది. ఖమ్మం జిల్లాను పూర్తిగా వరదలు ముంచెత్తాయి.  ఎక్కడికక్కడ కాలనీలు జల నిర్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఏమి చేయలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రెండు రోజులుగా ఇండ్లలోకి నీరు చేరడంతో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఖమ్మం జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా కానీ ఈ కష్టాల నుంచి బయటకి తెచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో మంత్రులందరికి ఎక్కడికక్కడ నిలదీతలు ఎదురవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 ఖమ్మంను ముంచిన వరదలు:
 గత కొద్దిరోజుల నుంచి ఐఎండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచనలు చేస్తూ వస్తోంది. అయినా మంత్రులు, అధికారులు అక్కడ ఉండేటువంటి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం  చేయలేకపోయారు.  వర్షాలు కురిసి వరదలు వచ్చి నష్టం జరిగేదాకా ఎవరు పట్టించుకోలేదు.  చెరువుల నీళ్లు వెళ్లి చెరువు వెనుక పడేదాకా  చేసేదేం లేదన్నట్టు మంత్రుల వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో తీవ్రంగా వర్షాలు కురిసాయి.  ఇక వీటి కంటే ఖమ్మం జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ వర్షం  కురియడంతో మరింత దారుణమైన పరిస్థితిలు ఏర్పడ్డాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో దారుణమైన వరదలు వచ్చాయి. పాలేరు రిజర్వాయర్ లోకి  కనివిని ఎరుగని నీరు వచ్చింది. 80 వేల క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న ఆ రిజర్వాయర్ లోకి  1,75,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ఆ నీటిని కిందికి వదిలే సందర్భంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి.

 దీంతో ఈ వరదల్లో వేలాదిమంది చిక్కుకోవడమే కాకుండా ఇద్దరు ముగ్గురు కొట్టుకుపోయారు.  ఈ తరుణంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లైఫ్ జాకెట్లు ఇచ్చాం కదా కాపాడుకోలేరా అన్న విధంగా మాట్లాడడంతో మరింత విమర్శలకు దారి తీసింది. ఈ విధంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క లాంటి కీలకమైన మంత్రులు ఉన్నా కానీ కనీసం ప్రజల  ప్రాణాలు పోకుండా కాపాడలేక పోతున్నారని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు.  అంతేకాదు పొంగులేటిని ఎక్కడికక్కడ  ప్రజలు అడ్డుకుంటూ కనీసం తినడానికి తిండి గింజలు లేవని , ఎన్నికల  సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు. వెంటనే  స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా తక్షణ సాయం కింద వరద బాధితులకు 10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతేకాదు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్న వెంటనే అక్కడికి వెళ్లి సమస్యలు క్లియర్ చేయాలని తెలియజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>