Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani793b1f3a-2306-4ce4-9c48-b5fca91fb67a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani793b1f3a-2306-4ce4-9c48-b5fca91fb67a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా కొంతమంది హీరోలకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే ఆయా హీరోలు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వారు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులందరికీ నాచురల్ స్టార్ గా కొనసాగుతున్న నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అవ్వాలి అనే ఆశతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన నాని.. పొరపాటున హీరో అయిపోయాడు. ఇక హీరో గానే కెరీర్ ని కొనసాగించిన నాని తెలుగు ప్రేక్షకులకు nani{#}Dussehra;Nani;Prabhas;vijay kumar naidu;Vijayadashami;Audience;Saturday;Tollywood;Hero;Director;India;Industry;Film Industry;Cinemaనా కెరియర్ లో టఫస్ట్ రోల్ అదే.. నాని కామెంట్స్ వైరల్?నా కెరియర్ లో టఫస్ట్ రోల్ అదే.. నాని కామెంట్స్ వైరల్?nani{#}Dussehra;Nani;Prabhas;vijay kumar naidu;Vijayadashami;Audience;Saturday;Tollywood;Hero;Director;India;Industry;Film Industry;CinemaTue, 03 Sep 2024 21:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా కొంతమంది హీరోలకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే ఆయా హీరోలు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మదిలో  ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వారు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులందరికీ నాచురల్ స్టార్ గా కొనసాగుతున్న నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అవ్వాలి అనే ఆశతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన నాని.. పొరపాటున హీరో అయిపోయాడు. ఇక హీరో గానే కెరీర్ ని కొనసాగించిన నాని తెలుగు ప్రేక్షకులకు నాచురల్ స్టార్ గా మారిపోయాడు.



 ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ హిట్టు సొంతం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే నాని ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. ఏకంగా నాని నటిస్తున్నాడు అన్నట్లుగా కాకుండా ఆ పాత్ర నిజంగా మాట్లాడుతుందేమో అన్న విధంగా నాని యాక్టింగ్ ఉంటుంది. ఆయన నటన ఇంత నాచురల్ గా ఉంటుంది కాబట్టే ప్రేక్షకులు నాని నాచురల్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఎలాంటి పాత్ర అయినా సరే ఎంతో అలవోకగా చేసేసే నాని కెరియర్లో కఠినమైన పాత్ర ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు నాని.



 ఇటీవల ఇండియా టుడే తో జరిగిన ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ లో భాగంగా మీ కెరియర్లో టఫెస్టు రోల్ ఏంటి అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. దసరా మూవీలో చేసిన క్యారెక్టర్ తన కెరియర్ లోనే టఫ్ఫెస్ట్ రోల్ అంటూ నాని చెప్పుకొచ్చాడు. కల్కి మూవీలో నటించార అనే ప్రశ్నకు లేదు ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న అంటూ తెలిపాడు. కాగా ఇటీవల నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ ప్రస్తుతం దూసుకుపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>