EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshaa7ac77d-c0fc-4ec9-b753-79a0f33e7dae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshaa7ac77d-c0fc-4ec9-b753-79a0f33e7dae-415x250-IndiaHerald.jpgవిశాఖ జిల్లాలో టీడీపీకి పూర్తి బలం ఉంది. ఆ పార్టీకి కంచుకోట విశాఖ జిల్లా. తాజా ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు గెలిచారు. పదవులు ఆశించారు. కానీ ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. అది కూడా పాయకరావు పేట కు చెందిన వంగలపూడి అనితకు కేటాయించారు. ఆమె వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయిదేళ్ల పాటు సమర్థంగా విపక్ష పాత్ర పోషించారు. దాంతో ఆమె విధేయత సమర్థత సేవలను గుర్తించి కీలకమైన హోంశాఖను చంద్రబాబు ఆమెకు కట్టబెట్టారు.lokesh{#}Nara Lokesh;Petta;Minister;Vishakapatnam;District;Party;CBN;TDP;YCPవిశాఖ టీడీపీలో లుకలుకలు! రంగంలోకి నారా లోకేశ్విశాఖ టీడీపీలో లుకలుకలు! రంగంలోకి నారా లోకేశ్lokesh{#}Nara Lokesh;Petta;Minister;Vishakapatnam;District;Party;CBN;TDP;YCPTue, 03 Sep 2024 08:31:30 GMTవిశాఖ జిల్లాలో టీడీపీకి పూర్తి బలం ఉంది. ఆ పార్టీకి కంచుకోట విశాఖ జిల్లా. తాజా ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు గెలిచారు. పదవులు ఆశించారు. కానీ ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. అది కూడా పాయకరావు పేట కు చెందిన వంగలపూడి అనితకు కేటాయించారు.


ఆమె వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయిదేళ్ల పాటు సమర్థంగా విపక్ష పాత్ర పోషించారు. దాంతో ఆమె విధేయత సమర్థత సేవలను గుర్తించి కీలకమైన హోంశాఖను చంద్రబాబు ఆమెకు కట్టబెట్టారు. ఇక ఎన్నికల ముందు హడావుడి చేసిన వారికి టికెట్లు కూడా ఊరించి ఇచ్చారు కానీ మంత్రి పదవులు ఇవ్వలేదు. దీంతో మొత్తం ఉమ్మడి జిల్లాల బాధ్యత అనితపై పడింది.


ఆమె అతి పెద్ద జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన విశాఖను మంత్రిగా లీడ్ చేయాల్సి వస్తోంది. దీంతో పాటుగా అమాత్య పదవి ఆశించిన సీనియర్లు ఆవి దక్కకపోవడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. గతంలోలాగా చురుకుగా వ్యవహరించడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ పర్యటన పెట్టుకున్న నారా లోకేశ్ మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు.


పార్టీ గురించి వాకబు చేశారు. నాయకులతో సమీక్షలు జరిపారు. విశాఖ జిల్లాలో పార్టీ ని పటిష్ఠంగా ఉంచాలని సూచించారు. వైసీపిన జనాలు నమ్మడం లేదని టీడీపీ భావన. పదవుల విషయంలో తనను కలిసిన వారందరికీ లోకేశ్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని చెప్పారంట. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అధిష్ఠానానికి తెలుసు అని.. ఎవరూ నిరాశ చెందవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక విశాఖ ప్రగతిపై మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్ వన్ సిటీగా దీనిని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని లోకేశ్ వివరించారు. మొత్తం మీద విశాఖ అభివృద్ది, రాజకీయాలపై లోకేశ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు  కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని పర్యటనలు  చేసి పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>