MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkat-prabhue30ecc6c-21ee-445b-bb3e-be5b9c63f39a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkat-prabhue30ecc6c-21ee-445b-bb3e-be5b9c63f39a-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గొట్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనుVenkat prabhu{#}Lokesh;dhanush;venkat prabhu;television;Joseph Vijay;Lokesh Kanagaraj;Dalapathi;Tamil;Box office;Interview;september;Telugu;Cinemaఆ కారణంతోనే విజయ్ తో సినిమా చేశాను.. వెంకట్ ప్రభు..!ఆ కారణంతోనే విజయ్ తో సినిమా చేశాను.. వెంకట్ ప్రభు..!Venkat prabhu{#}Lokesh;dhanush;venkat prabhu;television;Joseph Vijay;Lokesh Kanagaraj;Dalapathi;Tamil;Box office;Interview;september;Telugu;CinemaTue, 03 Sep 2024 16:05:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గొట్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను బాగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తమిళ ఇండస్ట్రీ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా , తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం ఈ సినిమాపై పెద్ద స్థాయిలో అంచనాలు ఏమీ లేవు. ఈ మూవీ విడుదల అయిన తర్వాత మంచి టాక్ ను తెచ్చుకుంటే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. వెంకట్ ప్రభు తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఈ మూవీ ని మొదట కమల్ హాసన్ , ధనుష్ లతో చేయాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత కాని ది ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఒకే నటుడి తో రెండు పాత్రలు చేయించాలి అని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే విజయ్ ని ఎంచుకున్నాను అని వెంకట్ ప్రభు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>