MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-secret-told-by-balayya-behind-indras-blockbuster8d979d21-51e1-4404-b102-ccf9def9ac07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-secret-told-by-balayya-behind-indras-blockbuster8d979d21-51e1-4404-b102-ccf9def9ac07-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు .. దర్శకులు ... నిర్మాతలు బాలయ్యతో పని చేసిన దర్శకులు .. ఇతర సాంకేతిక నిపుణులు హాజరై వన్నె తెచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాను నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్ర చేయటానికి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి ఆదర్శం అని చిరంజీవి తెలిపారు. బాలకృష్ణ తో కలిసి తనకు ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరిక ఉందన్న మనసులో మాట కూడా చిరంజీవి బయట పెట్టారు. balayya{#}Samarasimhareddy;Balakrishna;Chiranjeevi;Cinemaఇంద్ర సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ వెన‌క బాల‌య్య‌... చిరు చెప్పిన సీక్రెట్‌..!ఇంద్ర సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ వెన‌క బాల‌య్య‌... చిరు చెప్పిన సీక్రెట్‌..!balayya{#}Samarasimhareddy;Balakrishna;Chiranjeevi;CinemaMon, 02 Sep 2024 13:46:42 GMTనందమూరి నట‌సింహ బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాదులో నోవాటెల్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు .. దర్శకులు ... నిర్మాతలు బాలయ్యతో పని చేసిన దర్శకులు .. ఇతర సాంకేతిక నిపుణులు హాజరై వన్నె తెచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాను నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్ర చేయటానికి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి ఆదర్శం అని చిరంజీవి తెలిపారు. బాలకృష్ణ తో కలిసి తనకు ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరిక ఉందన్న మనసులో మాట కూడా చిరంజీవి బయట పెట్టారు.


ఇక తెలుగు సినిమా రంగంలో ఫ్యాక్షన్ సినిమాలకు మూలంగా నిలిచింది బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా. 1999 సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాకు పోటీగా సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సమరసింహారెడ్డి చాలా కేంద్రాలలో 175 రోజులు ఆడడంతో పాటు కొన్ని కేంద్రాల్లో రెండు వందల రోజులు కూడా ఆడింది. తెలుగు సినిమా చరిత్ర లో అప్పటివరకు ఉన్న చాలా రికార్డులకు సమరసింహారెడ్డి చెదలు పట్టించేసింది ఆ తర్వాత బాలయ్య వెంటనే రెండేళ్ల గ్యాప్లో మరోసారి 2000 నరసింహనాయుడు సినిమా చేసి మరోసారి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.


ఆ టైంలో చిరంజీవిపై కూడా ఓఫ్యాక్షన్ యాక్షన్ సినిమా చేయాలన్న ఒత్తిళ్లు అభిమానుల నుంచి ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అదే బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి ఇంద్ర సినిమా చేశారు. 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఎన్ని సంవత్సరాలకు చిరంజీవి తాను ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి స్ఫూర్తి అని చెప్పటం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>