MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-chiranjeevi-multistarrer-fix-story-is-the-same29d024e1-553c-4f89-ba67-e9123c349994-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-chiranjeevi-multistarrer-fix-story-is-the-same29d024e1-553c-4f89-ba67-e9123c349994-415x250-IndiaHerald.jpg ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ... ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు తెలుగు చలన సినిమా పరిశ్రమకు ఎంతో అపూర్వ ఘ‌ట్టం అని.. అద్భుత‌మైన‌ ఒక వేడుక అని.. ఇలాంటి అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు తమందరం ఎంతో సంతోషంగా ఉన్నామని చిరంజీవి స్పష్టం చేశారు. story{#}Balakrishna;Hero;Chiranjeevi;Cinemaబాల‌య్య - చిరంజీవి మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌... స్టోరీ ఇదే..!బాల‌య్య - చిరంజీవి మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌... స్టోరీ ఇదే..!story{#}Balakrishna;Hero;Chiranjeevi;CinemaMon, 02 Sep 2024 13:29:38 GMTటాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ... ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు తెలుగు చలన సినిమా పరిశ్రమకు ఎంతో అపూర్వ ఘ‌ట్టం అని.. అద్భుత‌మైన‌ ఒక వేడుక అని.. ఇలాంటి అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు తమందరం ఎంతో సంతోషంగా ఉన్నామని చిరంజీవి స్పష్టం చేశారు.


ఇక ఎన్టీఆర్కు ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం ఉందని ఆయన కుమారుడుగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదని చిరంజీవి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని బాలయ్యను చిరు కొనియాడారు. ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు .. హీరోల మధ్య ఎలాంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునే వాళ్ళం .. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు .. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన బాలయ్య వస్తారు ... మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు అన్నారు.


50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించిన బాలయ్యకే సొంతం .. బాలయ్యకు భగవంతుడు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాను అని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలోనే బాలయ్యతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించాలన్న కోరికను కూడా చిరంజీవి వ్యక్తం చేశారు. అది కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే స్టోరీ అయితే బాగుంటుందని కూడా చిరంజీవి జానర్ కూడా లీక్ చేసేసారు. మరి చిరంజీవి - బాలకృష్ణ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>