MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-bc1fe3ec-19f1-4806-9887-1e1a51aa5a79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-bc1fe3ec-19f1-4806-9887-1e1a51aa5a79-415x250-IndiaHerald.jpgభాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఈ బ్యూటీ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈ సినిమా ఫలితం పక్కన పెడితే.... ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ దక్కిందని చెప్పవచ్చు. trivikram {#}Bhagyashree;dulquer salmaan;vijay deverakonda;Joseph Vijay;gautham new;gautham;Wanted;ravi teja;Ravi;Mister;Industry;BEAUTY;trivikram srinivas;Telugu;Heroine;Cinemaత్రివిక్రమ్ చేతిలోకి మరో యంగ్ హీరోయిన్?త్రివిక్రమ్ చేతిలోకి మరో యంగ్ హీరోయిన్?trivikram {#}Bhagyashree;dulquer salmaan;vijay deverakonda;Joseph Vijay;gautham new;gautham;Wanted;ravi teja;Ravi;Mister;Industry;BEAUTY;trivikram srinivas;Telugu;Heroine;CinemaMon, 02 Sep 2024 13:43:00 GMTభాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఈ బ్యూటీ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈ సినిమా ఫలితం పక్కన పెడితే.... ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ దక్కిందని చెప్పవచ్చు.


ఈ సినిమాలో తనదైన నటన, అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులకు థాంక్స్ చెబుతూ.... సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపింది. జిక్కి పాత్రపై మీరు చూపిన ప్రేమాభిమానాలు నేను ఊహించలేదని పేర్కొంది.


నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా మీతో నా ప్రాజెక్టుల గురించి మరిన్ని విషయాలను షేర్ చేసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానంటూ రాసుకోచ్చింది. ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న "వీడి 12" లో విజయ్ సరసన హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది.


ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా హీరోయిన్గా ఈ బ్యూటీ అవకాశం అందుకుందట. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న క్రమంలో భాగ్యశ్రీ బోర్సేకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఛాన్స్ రాబోతుందట. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త వైరల్ అవుతుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>