PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-party-kerala-simi-rosebell-comments-viralb3915273-e64b-428c-aa71-f72d301d9502-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-party-kerala-simi-rosebell-comments-viralb3915273-e64b-428c-aa71-f72d301d9502-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ గా మారిపోయింది. మహిళా నటుల పైన కొంతమంది హీరోలు సీనియర్ నటులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఇటీవలే హేమ కమిటీ నివేదిక ద్వారా తెలిపింది. ఇది మాలీవుడ్ ఇండస్ట్రీనే కుదిపేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన కేరళ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కాంగ్రెస్ పార్టీ కి కూడా అలాంటి మురికి అంటుకుంటుందంటూ ఆవేదన తెలియజేస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం. మలయాళ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఒక సంచలనంగా మారడంతో ఇప్పుడు కేరళలో CONGRESS PARTY; KERALA;SIMI ROSEBELL;COMMENTS;VIRAL{#}John;Jaan;MP;Kerala;Congress;Party;hemaక్యాస్టింగ్ కౌచ్ సినిమాలలోనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా.. మహిళా నేత షాకింగ్ కామెంట్స్..!క్యాస్టింగ్ కౌచ్ సినిమాలలోనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా.. మహిళా నేత షాకింగ్ కామెంట్స్..!CONGRESS PARTY; KERALA;SIMI ROSEBELL;COMMENTS;VIRAL{#}John;Jaan;MP;Kerala;Congress;Party;hemaMon, 02 Sep 2024 13:07:11 GMTసినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ గా మారిపోయింది. మహిళా నటుల పైన కొంతమంది హీరోలు సీనియర్ నటులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఇటీవలే హేమ కమిటీ  నివేదిక ద్వారా తెలిపింది. ఇది మాలీవుడ్ ఇండస్ట్రీనే కుదిపేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన కేరళ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కాంగ్రెస్ పార్టీ కి కూడా అలాంటి మురికి అంటుకుంటుందంటూ ఆవేదన తెలియజేస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.


మలయాళ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఒక సంచలనంగా మారడంతో ఇప్పుడు కేరళలో  కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదంటూ సినీ పరిశ్రమకు ఏవిధంగా తీసిపోలేదంటూ కేరళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీమీ రోజ్ బెల్ జాన్ విమర్శల సైతం చేస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చాలామంది మహిళలు తాము ఎదుర్కొన్న ఇలాంటి ఇబ్బందులను తమతో పంచుకున్నారని తెలిపింది.. పార్టీకి సంబంధించిన మహిళలపై కొంతమంది పురుష నేతలు చాలామంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పదవులను ఆశ చూపించి సీనియర్ నేతలు సైతం మహిళలను లోబరుచుకుంటున్నారంటూ తెలుపుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని కచ్చితంగా ఏదో ఒక రోజు బయట పెడతామని తెలియజేస్తోంది.


తన మీద ఫిర్యాదు ఇచ్చిన వారు కూడా వీటిని గమనించాలని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎంపీ జేబీ మేథర్ పేరును కూడా తీసుకువచ్చింది. అలాగే మరికొంతమంది పేర్లను కూడా తీసుకువస్తూ పార్టీలో చాలా వరకు అనవసరంగా గౌరవాలు పొందుతున్న వారు చాలామంది ఉన్నారు అంటూ ఆమె ఆరోపిస్తోంది. 8 ఏళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని యూత్ కాంగ్రెస్ అఖిల భారత కార్యదర్శిగా నియమించినప్పుడు చాలామంది మౌనంగా ఉన్నారు.. కొంతమంది నేతలు మహిళలను నియమించడం పైన చాలా దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఆమె తెలియజేస్తోంది. అందులోనే ఇతర  మహిళల పట్ల చాలా ప్రేమను చూపించారు అంటూ విమర్శించింది. దీంతో ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈమెను పార్టీ నుంచి కూడా బహిష్కరించినట్లు తెలియజేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>