EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/mamtha47d36dd0-418a-4c20-8a98-1dcf5f08e685-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/mamtha47d36dd0-418a-4c20-8a98-1dcf5f08e685-415x250-IndiaHerald.jpgమమతా బెనర్జీ బెంగాల్ సీఎం. కోల్ కతాలోని మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ పై హత్యాచార ఘనట జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాధితురాలికి సంతాపంగా చాలా చోట్ల ఆందోళనలు, శాంతీయుత ర్యాలీలు జరిగాయి. కాగా బెంగాల్ జరిగిన ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. దీనికి బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న బీజేపీ మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. అయితే దీదీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈ కేసును సీబీఐకి వెmamtha{#}Mamata Benerjee;benarjee;CBI;Letter;Mamta Mohandas;Uri;Bharatiya Janata Party;Doctor;West Bengal - Kolkata;రాజీనామా;Nijam;Government;CMమమత దెబ్బకి మోదీ విలవిల..!మమత దెబ్బకి మోదీ విలవిల..!mamtha{#}Mamata Benerjee;benarjee;CBI;Letter;Mamta Mohandas;Uri;Bharatiya Janata Party;Doctor;West Bengal - Kolkata;రాజీనామా;Nijam;Government;CMMon, 02 Sep 2024 01:06:37 GMTమమతా బెనర్జీ బెంగాల్ సీఎం. కోల్ కతాలోని మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ పై హత్యాచార ఘనట జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.  బాధితురాలికి సంతాపంగా చాలా చోట్ల ఆందోళనలు, శాంతీయుత ర్యాలీలు జరిగాయి. కాగా బెంగాల్ జరిగిన ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. దీనికి బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించాయి.


అయితే దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న బీజేపీ మమత బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున  పెట్టింది. అయితే దీదీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈ కేసును సీబీఐకి వెళ్లేలా చేసింది. అతే ఇప్పుడు ఆమె విశ్వరూపం చూపిస్తున్నారు. నిందితుడికి ఉన్న పళంగా ఉరి శిక్ష వేయాలంటూ ధర్నాలు ప్రారంభించారు. తప్పు అంతా కేంద్రానిదే అన్నట్లు రోజుకో ప్రకటన చేస్తున్నారు.  కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు.


దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆమె అంటున్నారు. తాను ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాసినా స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. కోల్ కతా ఆసుపత్రి హత్యాచార ఘటన నిందితుడి విషయంలోను సీబీఐ నిర్ణయాలు కఠినంగా లేవని ఆమె ఆరోపిస్తున్నారు. కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు బీజేపీ నేతలు ఇలాంటి రాజకీయమే చేశారు. ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లేసరికి దీదీ అదే రాజకీయం చేస్తున్నారు. నిందితుడికి  ఉరిశిక్ష వేయాలని ధర్నాలు చేస్తున్నారు.


ప్రతి రాష్ట్రంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడం అసాధ్యం. సమాజం అంటే అదే. అయితే ప్రతి దానిని రాజకీయం చేయడం మన దగ్గరి నేతల ప్రత్యేకత. ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ఘోరంలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఆ నేరం చుట్టూ జరిగిన, జరుగుతున్న ప్రచారంతో చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. బీజేపీ దానిని ప్రారంభిస్తే.. మమత దానిని కొనసాగిస్తున్నారు. ఎవరూ తక్కువేం కాకపోయినా.. మోదీపై పట్టుసాధించేలా ఆమె వ్యవహరిస్తున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>