PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali250897be-f5c4-40e9-a44e-2be2a2e72e66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali250897be-f5c4-40e9-a44e-2be2a2e72e66-415x250-IndiaHerald.jpgఆయన వైసీపీ ఫైర్ బ్రాండ్. చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆయనే ఆ పార్టీ అధినేతకు మొదటి ఛాయిస్. సందర్భం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా, సమయం ఎప్పుడు అయినా.. చంద్రబాబుని తిట్టాలంటే గుర్తుకు వచ్చే పేరు కొడాలి నాని. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రి.. పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాల పాటు శాసించారు. అప్పుడు నిత్యం వార్తల్లో ఉంటూ తనదైన శైలిలో మాటలతో రెచ్చిపోయే ఆయన.. ఇప్పుడు kodali{#}Kodali Nani;Thota Chandrasekhar;kakinada;Nani;రాజీనామా;YCP;Jagan;MLA;News;TDP;Party;Massకనిపించని కొడాలి నాని. రాజకీయాలకు గుడ్ బై చెప్పారా?కనిపించని కొడాలి నాని. రాజకీయాలకు గుడ్ బై చెప్పారా?kodali{#}Kodali Nani;Thota Chandrasekhar;kakinada;Nani;రాజీనామా;YCP;Jagan;MLA;News;TDP;Party;MassMon, 02 Sep 2024 10:49:00 GMTఆయన వైసీపీ ఫైర్ బ్రాండ్. చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆయనే ఆ పార్టీ అధినేతకు మొదటి ఛాయిస్. సందర్భం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా, సమయం ఎప్పుడు అయినా.. చంద్రబాబుని తిట్టాలంటే గుర్తుకు వచ్చే పేరు కొడాలి నాని.


వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రి.. పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాల పాటు శాసించారు. అప్పుడు నిత్యం వార్తల్లో ఉంటూ తనదైన శైలిలో మాటలతో రెచ్చిపోయే ఆయన.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆచూకీ కూడా తెలియడం లేదు. అసలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడు బయటకు వస్తారో వంటి వివరాలేమీ తెలియరావడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు.


2024 ఎన్నికల ముందు వరకు కొడాలి అంటే ఒక బ్రాండ్. నాని అంటే ఒక సంచలనం. కానీ ఇప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. టీడీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నాఆయన మాత్రం స్పందించడం లేదు. ఫర్నిచర్ విషయంలో జగన్ పై టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు మాత్రం బయటకు వచ్చి మాట్లాడారు. ముష్టి ఫర్నిచర్ అంటూ ఏం పీకలేరు అంటూ తనదైన శైలిలో మాట్లాడారు.


 ఆ తర్వాత కొడాలి నాని వార్తలే కానీ మనిషి కనిపించలేదు. వాలంటీర్లను గుడివాడలో బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ ఆయనపై కేసు కూడా నమోదు అయింది. ఇది విచారణ సాగుతోంది. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇలా ఎన్నో రకాల ఆరోపణలు వినిపిస్తున్నా ఆయన మాత్రం బయటకు రావడం లేదు. వీటిపై స్పందించడం లేదు. గుడ్ల వల్లేరు సీసీ కెమెరాల వ్యవహారంపై కూడా ప్రభుత్వంపై ఒక్క విమర్శ చేయలేదు.  గతంలోనే చివరి సారి పోటీ అని కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారా అనే అనుమనాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>