Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle40408ae0-c870-4026-90e5-0ae2864d6a64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle40408ae0-c870-4026-90e5-0ae2864d6a64-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఐదు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్రేక్షకులు ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఆ తర్వాత కరోనా రావడంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా కావటం.. అటు రామ్ చరణ్ కూడా మరో హీరోగా ఉండడం తో మూడేళ్ల తర్వాత రిలీజ్ అయింది. త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా వచ్చి కూడా రెండేళ్లు socialstars lifestyle{#}Aravinda Sametha Veera Raghava;Coronavirus;Ram Charan Teja;koratala siva;trivikram srinivas;Chitram;Rajamouli;Mass;NTR;Cinema;Audience;Posters;India;Successదేవర కౌంట్ డౌన్ : 25 రోజులే సమయం.. ఎన్టీఆర్ మీదే భారం..!!దేవర కౌంట్ డౌన్ : 25 రోజులే సమయం.. ఎన్టీఆర్ మీదే భారం..!!socialstars lifestyle{#}Aravinda Sametha Veera Raghava;Coronavirus;Ram Charan Teja;koratala siva;trivikram srinivas;Chitram;Rajamouli;Mass;NTR;Cinema;Audience;Posters;India;SuccessMon, 02 Sep 2024 18:45:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఐదు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్రేక్షకులు ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఆ తర్వాత కరోనా రావడంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా కావటం.. అటు రామ్ చరణ్ కూడా మరో హీరోగా ఉండడం తో మూడేళ్ల తర్వాత రిలీజ్ అయింది. త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయింది.
సినిమా వచ్చి కూడా రెండేళ్లు దాటుతున్నా.. ఇంకా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ను థియేటర్లలో ఎప్పుడు ఎప్పుడు చూడాలా..? అని ఒకటే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలోకి వస్తుంది. మొత్తం ఐదు భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా దేవరను తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కు మరో 25 రోజుల టైం ఉన్నా కూడా.. ఓవర్సీస్ లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. దేవర ఫ్రీ సేల్స్ లో రికార్డులు సెట్ చేస్తోంది. కేవలం కొన్ని ఏరియాలలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే దేవర మాసివ్ బుకింగ్స్ నమోదు చేయడం విశేషం. దేవర ఇప్పటికే లక్ష డాలర్ల మార్క్ దాటేసి మాస్ యానియా ను కంటిన్యూ చేస్తోంది. ఇది ఇలాగే ఉంటే దేవర రిలీజ్ డే నాటికి మిలియన్ మార్క్‌ దాటేసి సెన్సేషనల్ రికార్డులు బద్దలు కొడుతుందన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.ఈ చిత్రం నుండి ఇప్పటికే రెండు ప్రసిద్ధ పాటలు, 'ఫియర్ సాంగ్'తో ప్రకంపనలు సృష్టించింది మరియు 'చుట్టమల్లె' చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 25 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>