Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8d91329a-cce0-4fff-88b6-19f55d78c033-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8d91329a-cce0-4fff-88b6-19f55d78c033-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్.. ఇది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగు రాజకీయాల్లోనే ఈ నేమ్ ఇప్పుడు బ్రాండ్ గా మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పోటీ చేసిన 21 మందిని కూడా గెలిపించుకుని ఏకంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిపోయారు. ఒకప్పుడు రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించినోళ్లే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి నోరెళ్ళపెట్టేలా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఆయన. అయితే పవనPawan{#}king;King;pithapuram;Andhra Pradesh;Hanu Raghavapudi;Assembly;Hero;Party;Telugu;Cinema;kalyanజనసేనాని : పవన్ కళ్యాణ్ హీరో అయింది సినిమాలతో కాదు.. వ్యక్తిత్వంతో?జనసేనాని : పవన్ కళ్యాణ్ హీరో అయింది సినిమాలతో కాదు.. వ్యక్తిత్వంతో?Pawan{#}king;King;pithapuram;Andhra Pradesh;Hanu Raghavapudi;Assembly;Hero;Party;Telugu;Cinema;kalyanMon, 02 Sep 2024 09:37:00 GMTపవన్ కళ్యాణ్.. ఇది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు ఒక  బ్రాండ్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగు రాజకీయాల్లోనే ఈ నేమ్ ఇప్పుడు బ్రాండ్ గా మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పోటీ చేసిన 21 మందిని కూడా గెలిపించుకుని ఏకంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిపోయారు. ఒకప్పుడు రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించినోళ్లే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి నోరెళ్ళపెట్టేలా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఆయన.


 అయితే పవన్ కళ్యాణ్ ను విమర్శించే ప్రత్యర్ధులు అందరూ కూడా ఆయనని సినిమా హీరో  అని అంటూ ఉంటారు. నిజమే ఆయన సినిమాలతోనే ఫేమస్ అయ్యారు. సినిమాలతోనే అందరికీ తెలిసారు. కానీ సినిమాలతో హీరో అవ్వలేదు. ఎందుకంటే మిగతా హీరోలతో పోల్చి చూస్తే ఆయన క్రేజ్ ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ అది కేవలం సినిమాలతో వచ్చింది కాదు. మిగతా హీరోలతో పోలిస్తే ఆయన చేసింది తక్కువ సినిమాలే. అందులో హిట్ సినిమాలు కూడా కొన్నే. ఇలాంటి కెరియర్ ఎవరికీ ఉన్న అంత క్రేజ్ వచ్చేది కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ మిగతా హీరోలను దాటి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీనికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కారణం.


 ఎంత పెద్ద హీరో అయినా సామాన్య జీవితాన్ని గడిపే ఆయన స్వభావం.. ఎవరికైనా సమస్య వచ్చిందంటే సొంత వారికే కష్టం వచ్చిందేమో అన్నట్లుగా  తల్లడిల్లిపోయే మంచి హృదయం.. అన్యాయం జరిగిందంటే చాలు బాధితుల పక్షాన నిలబడి ఎంతటి వారినైనా ఎదిరించే తత్వమే ఆయనను హీరోని చేసింది. రాజకీయాల్లోనూ ఇదే ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. ప్రజలు అస్సలు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని నమ్మలేదు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా తాను మాత్రం ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన నాయకుడిని అని మాటలతో చెప్పడం కాదు చేతులతోనే చేసి చూపించారు.


 పదవి ఉన్నోళ్లే ప్రజలను పట్టించుకోకుండా మొహం చాటేస్తే.. ఎలాంటి పదవి లేకుండానే ప్రజల పక్షాన నిలబెట్టారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. తను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదు అని నిరూపించారు. ఇంకేముంది  2024 ఎన్నికల్లో పిఠాపురంలో గెలవడమే కాదు.. తన పార్టీ ఎమ్మెల్యేలు అందరిని గెలిపించుకుని కింగ్ మేకర్ గా మారారు. ఇలా సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయన హీరోగా మారింది కేవలం ఆయన వ్యక్తిత్వం తోనే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>