MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jaganadh28b78690-f20c-42a0-98ba-ef161979d61d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jaganadh28b78690-f20c-42a0-98ba-ef161979d61d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చాలా సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాథ్ తను దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలతో కొత్త హీరోయిన్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే సినిమాతో అనుష్క నటిగా కెరియర్ను ప్రారంభించింది. ఈ సినిమాలో ఈమెPuri jaganadh{#}Interview;Industries;anoushka;BEAUTY;Silver;puri jagannadh;Telugu;Heroine;Cinemaఆ హీరోయిన్ చేసిన పనికి షాక్ అయిన పూరి జగన్నాథ్.. తీరా చూస్తే స్టార్ హీరోయిన్..?ఆ హీరోయిన్ చేసిన పనికి షాక్ అయిన పూరి జగన్నాథ్.. తీరా చూస్తే స్టార్ హీరోయిన్..?Puri jaganadh{#}Interview;Industries;anoushka;BEAUTY;Silver;puri jagannadh;Telugu;Heroine;CinemaMon, 02 Sep 2024 16:32:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చాలా సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాథ్ తను దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలతో కొత్త హీరోయిన్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే సినిమాతో అనుష్క నటిగా కెరియర్ను ప్రారంభించింది.

ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఈ సినిమా కూడా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సాధించడంతో ఈ మూవీ తో అనుష్క కు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే తాజాగా అనుష్క ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఆమెకు మొదటి సినిమా అవకాశం వచ్చినప్పుడు ఆమె చేసిన ఒక పని గురించి తాజాగా అనుష్క వివరించింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అనుష్క మాట్లాడుతూ ... సూపర్ సినిమాలో పూరి జగన్నాథ్ గారు నన్ను హీరోయిన్గా అనుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు నన్ను కలిసి ఏమైనా ఫొటోస్ ఉన్నాయా అని అడిగాడు. దానితో నేను ఉన్నాయి అని చెప్పి ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తీసి పూరి జగన్నాథ్ గారికి ఇచ్చాను. దానితో ఆయన వెంటనే నవ్వుకున్నాడు. అసలు హీరోయిన్ కావాలి అనుకునే వారు ఫోటో షూట్ లను చేస్తారు అని , ఆ ఫోటోలను దర్శకులకు చూపిస్తారు అనే విషయం కూడా నాకు తెలియదు అని అనుష్క తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>