Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle158337aa-af40-4f3f-9653-c9e2884e786d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle158337aa-af40-4f3f-9653-c9e2884e786d-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఇక తగ్గేదేలే అంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అల్లు అర్జున్ ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకు వెళ్లేందుకు సుకుమార్ పుష్ప2 సినిమాపై ఇంకా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకుంటూ వస్తూ చివరికి దాన్ని పోస్ట్ పోన్ చేసి, డిసెంబర్ 6న విడుదల కు సిద్ధం గా వుంది.పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనsocialstars lifestyle{#}Allu Arjun;anasuya bharadwaj;devi sri prasad;sukumar;December;Blockbuster hit;Darsakudu;Reddy;Anasuya;Wife;Success;Director;Hero;Cinema;Newsపుష్ప 2 లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సినిమాకు అతి పెద్ద మలుపు అదే..?పుష్ప 2 లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సినిమాకు అతి పెద్ద మలుపు అదే..?socialstars lifestyle{#}Allu Arjun;anasuya bharadwaj;devi sri prasad;sukumar;December;Blockbuster hit;Darsakudu;Reddy;Anasuya;Wife;Success;Director;Hero;Cinema;NewsMon, 02 Sep 2024 22:45:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఇక తగ్గేదేలే అంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అల్లు అర్జున్ ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకు వెళ్లేందుకు సుకుమార్ పుష్ప2 సినిమాపై ఇంకా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకుంటూ వస్తూ చివరికి దాన్ని పోస్ట్ పోన్ చేసి, డిసెంబర్ 6న విడుదల కు సిద్ధం గా వుంది.పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను రిలీజ్ చేస్తే ఆ పాటలు కూడా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.ఇదిలావుండగా పుష్ప 1 లో సునీల్‌ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌ గా దర్శకుడు సుకుమార్‌ చూపించాడు.కాని అనూహ్యంగా భార్య అయిన అనసూయ అతడి మెడ కోయడం విడ్డూరంగా అనిపిస్తుంది.పుష్ప 2 లో సునిల్‌ ఉండక పోవచ్చు.ఆయన రేంజ్ లో విలనిజం ను అనసూయ చూపించబోతుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పార్ట్‌ 1 లో మంగళం శ్రీను పాత్ర ను ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా చూపించారు.పుష్ప 2 లో మంగళం శ్రీను పాత్ర చనిపోయినట్లుగా చూపించడం లో ఎలాంటి ఇబ్బంది లేదు.

ఎలాంటి విడ్డూరం లేదు.కాని దర్శకుడు సుకుమార్‌ మాత్రం మంగళం శ్రీను పాత్రను మరింత పాపులర్ అయ్యే విధంగా కఠినంగా పుష్ప 2 లో చూపించేందుకు సిద్ధం అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ కు పుష్ప కి మధ్య చివరి వరకు చాలా బీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలో చూపించి చివరకు మంగళం శీను పుష్ప నియమించిన ఒక కోవర్టుగా కనిపిస్తాడట... దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలి రెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలువబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టు లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలైతే చెబుతున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు... చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడో. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి ట్విస్ట్ లతో అలరించబోతుందో అని తెలుసుకోవాలంటే డిసెంబర్ 6వరకు వేచిచూ డాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>