PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuf605f11f-a090-493f-9b7c-03340aa1db5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuf605f11f-a090-493f-9b7c-03340aa1db5e-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాలనీలు, రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 2:30 గంటల సమయంలో కలింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. chandrababu{#}Krishna River;Prakasam;Undavalli;sunday;Telangana Chief Minister;CBN;Telugu;Jaganచంద్రబాబు ఇంటికి పెను ప్రమాదం?చంద్రబాబు ఇంటికి పెను ప్రమాదం?chandrababu{#}Krishna River;Prakasam;Undavalli;sunday;Telangana Chief Minister;CBN;Telugu;JaganSun, 01 Sep 2024 12:35:00 GMTతెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాలనీలు, రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 2:30 గంటల సమయంలో కలింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ లను జారీ చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇక అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. మొదటి ప్రమాదక హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఫలితంగా అధికారులు 70 గేట్లను ఎత్తివేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.


దీని ప్రభావం వల్ల ఉండవల్లి వద్ద కృష్ణానది తీరంలో నిర్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వరద ముంపు భయం ఏర్పడుతోంది.  ఏ క్షణంలోనైనా వరద నీరు చంద్రబాబు ఇంట్లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదికి సంభవించిన వరద సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.


అప్పట్లో ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోటును అడ్డం పెట్టారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో వరద నీరు ఇంటిని చుట్టు ముట్టే ప్రమాదం ఉందనే ప్రచారం కొనసాగుతోంది. కాగా.. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేస్తున్నారు చంద్రబాబు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదని... కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>