Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/natasimham-balayyaku-superstar-best-wishesecb2f1f9-992c-4a77-b7ce-dbb1f062198b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/natasimham-balayyaku-superstar-best-wishesecb2f1f9-992c-4a77-b7ce-dbb1f062198b-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన అద్భుతమైన నటనతో చరిత్ర సృష్టించారు. తాతమ్మ కల సినిమాతో బాల నటుడుగా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం జరిగింది.. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు బాలయ్య. ఆ తరువాత హీరోగా వరుస సినిమాలు చేసిన బాలయ్య ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.. తనదైన నటనాశైలితో బాలయ్య ఎన్నో అవార్డ#rajanikanth{#}Cancer;king;King;vishwa;Event;Industries;history;MLA;Industry;Film Industry;media;India;Hyderabad;Telugu;Blockbuster hit;lion;Balakrishnaనటసింహం బాలయ్యకు సూపర్ స్టార్ బెస్ట్ విషెస్.. ట్వీట్ వైరల్..!!నటసింహం బాలయ్యకు సూపర్ స్టార్ బెస్ట్ విషెస్.. ట్వీట్ వైరల్..!!#rajanikanth{#}Cancer;king;King;vishwa;Event;Industries;history;MLA;Industry;Film Industry;media;India;Hyderabad;Telugu;Blockbuster hit;lion;BalakrishnaSun, 01 Sep 2024 10:19:43 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన అద్భుతమైన నటనతో చరిత్ర సృష్టించారు. తాతమ్మ కల సినిమాతో బాల నటుడుగా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం జరిగింది.. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు బాలయ్య. ఆ తరువాత హీరోగా వరుస సినిమాలు చేసిన బాలయ్య ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.. తనదైన నటనాశైలితో బాలయ్య ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలయ్య ఎన్నో ఆటు పోటులు ఎదుర్కున్నారు..ఒకానొక సమయంలో వరుస ప్లాప్స్ అందుకున్న బాలయ్య స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీలతో అదరగొడుతూ వచ్చారు..సినీ రంగంలోనే కాదు రాజకీయంగాను బాలయ్య కు తిరుగులేదు.. హిందుపూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై బాలయ్య చరిత్ర సృష్టించారు.. అలాగే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదలకు వైద్యసహాయం అందిస్తూ వచ్చారు.

బాలయ్య నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు.బాలయ్య తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.బాలయ్య మంచి స్నేహితుడు అయిన సూపర్ రజనీకాంత్ తాజాగా బాలయ్యకు బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసారు..యాక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయిన సోదరుడు బాలకృష్ణ తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది..ఇంతటి గ్రేట్ అచీవ్మెంట్ సాధించిన బాలయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఆయనకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం మనసు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తలైవా ట్వీట్ చేసారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>