MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarae2d31c12-4817-4744-be34-b62c183d533a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarae2d31c12-4817-4744-be34-b62c183d533a-415x250-IndiaHerald.jpg ఈ భారీ యాక్షన్ డ్రామా కనీవినీ ఎరగని రేంజ్ లో థియేటర్లలోకి దిగిపోతుంది. మొత్తం ఐదు భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. devara{#}Janhvi Kapoor;NTR;koratala siva;Director;Cinema' దేవ‌ర ' త‌మిళ్ రైట్స్ ఎంతకు అమ్మారు... ఎన్టీఆర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. !' దేవ‌ర ' త‌మిళ్ రైట్స్ ఎంతకు అమ్మారు... ఎన్టీఆర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. !devara{#}Janhvi Kapoor;NTR;koratala siva;Director;CinemaSun, 01 Sep 2024 13:06:51 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్లలోకి రాబోతుంది. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా కనీవినీ ఎరగని రేంజ్ లో థియేటర్లలోకి దిగిపోతుంది. మొత్తం ఐదు భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు.


ఇటు సినీ అభిమానులు కూడా దేవర ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా.. అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలోనూ బిజినెస్ పరంగా క్రేజీ నెలకొంది. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఎన్టీఆర్ బాగా దృష్టి పెట్టారు. దేవరతో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఎన్టీఆర్ చాలా కసితో పని చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతల సైతం ఎగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు.


దేవర తమిళ్ రైట్స్ రూ.7.5 కోట్లు పలికినట్టు తెలుస్తుంది. ఇది నిజంగా మంచి రేట్ అని చెప్పాలి. తమిళ సినిమాలను మనవాళ్లు కోట్లు కుమ్మరించి కొనుకుంటున్నారు. కానీ తెలుగు సినిమాలు మాత్రం అక్కడ ఎక్కువ రేటు పెట్టేందుకు ఒప్పుకోవటం లేదు. ఈ లెక్కన ఎన్టీఆర్ సినిమాకు ఏడున్నర కోట్లు అంటే సాలిడ్ ధరకు అమ్ముడుపోయినట్టే చెప్పాలి. దేవర మూవీ కోలీవుడ్‌లో ఫుల్ రన్ లో రూ.18 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్ళు రాబడితే ఈజీగా బ్రేక్ ఈవెన్‌ అయిపోతుంది. దేవర సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రూ.18 కోట్ల గ్రోస్ అనేది పెద్ద లెక్కలోది కాదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>