Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8256ab65-39a1-4e6c-b99b-f9e6dae20044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8256ab65-39a1-4e6c-b99b-f9e6dae20044-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను మహేష్ బాబు కాస్త ఆలస్యంగా చూశారు. అయితే... పోస్ట్ వేయడానికి మాత్రం ఆలస్యం చేయలేదు. సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియాలో తన అభిప్రాయం వెల్లడించారు.ఇందులో రావు రమేష్ సరసన సీనియర్ నటి ఇంద్రజ నటించగా... ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య, అతడు ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించారు. ఇతర కీలక పాత్రల్లో అజయ్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, ప్రవీణ్ తదితరులు సంsocialstars lifestyle{#}indraja;lakshman;praveen;Sri Venkateswara swamy;Athadu;rao ramesh;sukumar;ramya;ramya krishnan;producer;Producer;mahesh babu;maruti;Rajani kanth;Santosham;Huzur Nagar;Telugu;Cinemaఆ సినిమాపై మహేష్ ప్రశంసల వర్షం.. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అంటూ..!!ఆ సినిమాపై మహేష్ ప్రశంసల వర్షం.. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అంటూ..!!socialstars lifestyle{#}indraja;lakshman;praveen;Sri Venkateswara swamy;Athadu;rao ramesh;sukumar;ramya;ramya krishnan;producer;Producer;mahesh babu;maruti;Rajani kanth;Santosham;Huzur Nagar;Telugu;CinemaSun, 01 Sep 2024 13:45:00 GMTవిలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను మహేష్ బాబు కాస్త ఆలస్యంగా చూశారు. అయితే... పోస్ట్ వేయడానికి మాత్రం ఆలస్యం చేయలేదు. సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియాలో తన అభిప్రాయం వెల్లడించారు.ఇందులో రావు రమేష్ సరసన సీనియర్ నటి ఇంద్రజ నటించగా... ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య, అతడు ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించారు. ఇతర కీలక పాత్రల్లో అజయ్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, ప్రవీణ్ తదితరులు సందడి చేశారు. సినిమా విజయం సాధించడంతో శని, ఆదివారాల్లో ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారిని 'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్ర బృందం దర్శించుకుంది. స్వామి ఆశీర్వాదం తీసుకుంది. సినిమాకు మంచి వసూళ్లు సైతం వచ్చాయి. ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునే సినిమా అని పేరు రావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. సినిమా విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ జీటీవీకి అమ్మేశారు.ఇదిలావుండగా కామన్ ప్రేక్షకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం తక్కువ కాదు. తానొక స్టార్ అయినా సరే విడుదలైన ప్రతి సినిమా చూడటం ఆయనకు అలవాటు అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. తనకు నచ్చిన సినిమా గురించి పోస్ట్ చేయడానికి సైతం ఆయన ఎప్పుడూ వెనుకాడరు. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా నచ్చిన సినిమా గురించి చెబుతారు. ఇప్పుడు 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా గురించి పోస్ట్ చేశారు.

టాలీవుడ్‌లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ సమర్పించడం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. కాగా, ఈ సినిమాకు సెలెబ్రిటీలు సైతం అభినందనలు తెలిపారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’పై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ టైమ్‌లో వచ్చిన హిలేరియస్ చిత్రాల్లో ఈ సినిమా నిలుస్తుందని మహేష్ అన్నారు.వాట్ ఏ హిలేరియస్ రైడ్. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం ఒకటి. నిర్మాత తబిత సుకుమార్‌, చిత్ర బృదంకు అభినందనలు' అని సూపర్ స్టార్ రాసుకొచ్చారు. మహేశ్ తమ సినిమాను అభినందించడంపై తబిత సుకుమార్ స్పందించారు. 'మా సినిమాను చూసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం. మీ సపోర్ట్‌ లభించడం మా మూవీకి పెద్ద ఘనత' అని పేర్కొన్నారు.ఇలా మహేష్ బాబు తమ సినిమా గురించి అభినందనలు తెలపడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>