MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-narasimha-naidu-simran-b-gopal-chinni-krishna-venkatesh-chiranjeev6456419d-5d51-4391-a46b-c3d34fc4935d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-narasimha-naidu-simran-b-gopal-chinni-krishna-venkatesh-chiranjeev6456419d-5d51-4391-a46b-c3d34fc4935d-415x250-IndiaHerald.jpg బాలకృష్ణ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరు కూడా లేని విధంగా ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నటువంటి హీరో అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు అనగానే చాలామందికి బాలకృష్ణ సినిమాలే గుర్తుకు వస్తాయి. అలా తన కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించి కోట్లాదిమంది గుండెల్లో కొలువుదీరిన బాలకృష్ణ నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ ఆయనకు ఘనంగా 50 సంవత్సరాల సర్వోతBALAKRISHNA; NARASIMHA NAIDU; SIMRAN; B.GOPAL; CHINNI KRISHNA;VENKATESH; CHIRANJEEV{#}b gopal;Train;Narasimhanaidu;Makar Sakranti;Yevaru;Venkatesh;politics;Telugu;Simran Bagga;Chiranjeevi;Director;Heroine;January;Rayalaseema;Hero;Chitram;Cinema;Balakrishnaబాలయ్య స్వర్ణోత్సవం: కంటిచూపుతో బాక్సాఫీస్ ని శాసించిన "నరసింహ నాయుడు".!!బాలయ్య స్వర్ణోత్సవం: కంటిచూపుతో బాక్సాఫీస్ ని శాసించిన "నరసింహ నాయుడు".!!BALAKRISHNA; NARASIMHA NAIDU; SIMRAN; B.GOPAL; CHINNI KRISHNA;VENKATESH; CHIRANJEEV{#}b gopal;Train;Narasimhanaidu;Makar Sakranti;Yevaru;Venkatesh;politics;Telugu;Simran Bagga;Chiranjeevi;Director;Heroine;January;Rayalaseema;Hero;Chitram;Cinema;BalakrishnaSun, 01 Sep 2024 09:29:01 GMT
-కత్తులతో కాదు కంటిచూపుతో చంపేస్తా.. 

-చిరంజీవి,వెంకటేష్ సినిమాలను వెనక్కి నెట్టిన బాలయ్య..


- 60 లక్షల బ్రిడ్జ్.. 36 సుమోలతో సంచలన ఫైట్..


 -బాక్సాఫీస్ బోనాంజ బాలయ్య..


 బాలకృష్ణ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇండస్ట్రీలో ఎవరు కూడా లేని విధంగా ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నటువంటి హీరో అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు అనగానే చాలామందికి బాలకృష్ణ సినిమాలే గుర్తుకు వస్తాయి.  అలా తన కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించి కోట్లాదిమంది గుండెల్లో కొలువుదీరిన బాలకృష్ణ నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది.  ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ ఆయనకు ఘనంగా 50 సంవత్సరాల సర్వోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అలాంటి ఈ వేడుకల సందర్భంగా బాలకృష్ణ సినీ కెరియర్ ను అద్భుతంగా మార్చేసిన సినిమా నరసింహనాయుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 బాక్సాఫీస్ పై చెడుగుడు :

 సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలామంది హీరోల సినిమాలు పోటీలో నిలుస్తాయి. ఆ విధంగానే 2001 సంక్రాంతి సమయం ఈ టైంలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి.  ఇందులో మెగాస్టార్ నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు, బాలకృష్ణ హీరోగా చేసిన నరసింహనాయుడు ఈ చిత్రాలు మూడు సంక్రాంతి బరిలో హోరాహూరిగా తలపడ్డాయి. ఇంతటి పోటీలో కూడా బాలకృష్ణ చేసిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ సాధించింది. డైరెక్టర్ బి గోపాల్,బాలకృష్ణ కాంబోలో ఈ చిత్రం ప్రారంభమైంది.  ఇది బి గోపాల్ కి 25వ సినిమా.  చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని సంచలనం సృష్టించాలని అనుకున్నాడు. వెంటనే బి.గోపాల్ తన టచ్ లో ఉన్నటువంటి చిన్ని కృష్ణని పిలిచి అద్భుతమైన కథ తెప్పించారు. పంజాబ్లో ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు ఆర్మీలోకి పోవాలనే రూల్ ఉంది. దాన్నిబట్టి కథ తయారు చేశాడు చిన్నికృష్ణ.


 ఇందులో రాయలసీమ బ్యాగ్రౌండ్ పెట్టి ఫ్యాక్షనిస్టుల నుండి వారి ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఇంటికి ఒకరు సైన్యంగా ఏర్పడి ఎదుర్కోవడం కాన్సెప్ట్. కథ బాలకృష్ణకు ఎంతో నచ్చింది. వెంటనే పరుచూరి గోపాలకృష్ణని పిలిపించి కథలో కాస్త చేంజింగ్ చేయించారు.ఇందులో హీరోయిన్ గా సిమ్రాన్ ని తీసుకున్నారు. ఇక షూటింగ్ చాలా అద్భుతంగా జరిగింది.ఒక సీన్ చిత్రీకరణ కోసం 60 లక్షల పెట్టి 120 అడుగుల బ్రిడ్జి నిర్మించారు. అలాగే ట్రైన్ సుమో చేజింగ్ సీన్స్ కోసం వందమంది ఫైటర్స్ తో ఎనిమిది రోజుల షూటింగ్ జరిగింది. దాదాపు 36సుమాలు పాడైపోయాయి.   ఇక డైలాగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దీంతో "కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా" అనే డైలాగ్ ఈ సినిమాకు వాడారు. ఇప్పటికీ ఈ డైలాగ్ వాడుకలో ఉందంటే అది ఎంతగా జనాలపై ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. 6 కోట్ల బడ్జెట్ తో షూటింగ్ అంతా పూర్తి చేశారు. జనవరి 11,2001న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.  ఏకంగా 105 కేంద్రాలలో శత దినోత్సవాన్ని జరుపుకుంది. మొత్తం 30 కోట్ల గ్రాస్ ని 20 కోట్ల షేర్ ని అందుకొని ఆల్ టైం రికార్డు సాధించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>