MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actressc7fe8576-2600-4a6a-97cc-2627c584c973-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actressc7fe8576-2600-4a6a-97cc-2627c584c973-415x250-IndiaHerald.jpgప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి ఆకస్మికంగా మరణించారు. అభినయ చెప్పిన విషయం ప్రకారం, ఆమె ఆటోలో వెళ్లి వచ్చిన తర్వాత ఈ దురదృష్టవంతమైన సంఘటన జరిగింది. ఆగస్టు 17న ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై అభినయ తన తల్లిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. actress{#}Ravi;Shiva;abinaya;ravi teja;Tamilnadu;lord siva;Cinema;Teluguప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..actress{#}Ravi;Shiva;abinaya;ravi teja;Tamilnadu;lord siva;Cinema;TeluguSun, 01 Sep 2024 16:45:00 GMTప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి ఆకస్మికంగా మరణించారు. అభినయ చెప్పిన విషయం ప్రకారం, ఆమె ఆటోలో వెళ్లి వచ్చిన తర్వాత ఈ దురదృష్టవంతమైన సంఘటన జరిగింది. ఆగస్టు 17న ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై అభినయ తన తల్లిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"అమ్మా, నువ్వు లేకుండా నేను ఇంకా బతకలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేవు కదా. నా తాతగారు ఎలా రిక్షాలో చనిపోయారో, నువ్వు కూడా అలాగే రిక్షాలో చనిపోయారు. నాన్న, కూతురు ఇద్దరూ ఒకేలా చనిపోవడం ఎంత పెద్ద యాదృచ్చికమో! నీ లేకపోతే నేను ఇంత ఎదగేదాన్ని కాదు. నువ్వు ఎప్పుడూ నాకు అండగా నిలిచావు. ఇప్పుడు సాయిసునందన్ నీ బాధ్యతను చూసుకుంటాడు. నేను మరో జన్మ ఎత్తినా నీ కూతురిగానే పుట్టాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు అని అభినయ గారు చాలా బాధగా చెప్పారు.

అభినయ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది సినిమా సెలబ్రిటీలు, అభిమానులు, ఇంకా సామాన్య ప్రజలు ఆమె తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అభినయ ఈ బాధను తట్టుకోవడానికి దేవుడు ఆమెకు బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.

అభినయ తమిళనాడు వాసి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. ఆమె పుట్టుకతో చెవిటి. అంటే ఆమెకు వినపడదు, మాట్లాడలేదు. అయినప్పటికీ, సినిమాల్లో ఆమె నటనలో చాలా ప్రతిభ ఉంది. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా రవితేజ నటించిన 'శంభో శివ శంభో' సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబుల సిస్టర్‌గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ఈ మాట చెప్పక అయ్యో పాపం అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తక్కువ వయసులోనే ఆమె తల్లిని కోల్పోయింది అంటూ తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>