MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-balakrishna-balakrishna-50-years-celebrations-nandamuri-familyc49fa658-3e11-4cbd-9ea2-8b90a58a5a53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-balakrishna-balakrishna-50-years-celebrations-nandamuri-familyc49fa658-3e11-4cbd-9ea2-8b90a58a5a53-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని గ్రాండ్ నిర్వహిస్తున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొంతమంది.. అయితే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలోని ఫేమస్ ఆలయాలను దర్శించుకుంటున్నారు.అంతేకాదు తల్లికి ఎంతో ఇష్టమైన గుడిని దర్శించి తన తల్లి కోరికను నెరవేర్చారు.ఇక పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే ఎక్కడైనా సరే మీడియా.. జనాలు ఊరుకుంటారా.. కన్నడలో కూడా అలాగే మీడియా, అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని చుట్టుముట్JR.NTR; BALAKRISHNA; BALAKRISHNA 50 YEARS CELEBRATIONS; NANDAMURI FAMILY{#}Santosham;Balakrishna;ram pothineni;India;media;NTR;Jr NTR;Teluguబాలయ్య 50ఏళ్ల సినీ వేడుక.. మనశ్శాంతి కావాలంటున్న ఎన్టీఆర్..?బాలయ్య 50ఏళ్ల సినీ వేడుక.. మనశ్శాంతి కావాలంటున్న ఎన్టీఆర్..?JR.NTR; BALAKRISHNA; BALAKRISHNA 50 YEARS CELEBRATIONS; NANDAMURI FAMILY{#}Santosham;Balakrishna;ram pothineni;India;media;NTR;Jr NTR;TeluguSun, 01 Sep 2024 20:42:00 GMTబాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని గ్రాండ్ నిర్వహిస్తున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొంతమంది.. అయితే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలోని ఫేమస్ ఆలయాలను దర్శించుకుంటున్నారు.అంతేకాదు తల్లికి ఎంతో ఇష్టమైన గుడిని దర్శించి తన తల్లి కోరికను నెరవేర్చారు.ఇక పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే ఎక్కడైనా సరే మీడియా.. జనాలు ఊరుకుంటారా.. కన్నడలో కూడా అలాగే మీడియా, అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని చుట్టుముట్టారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ని కొంతమంది మీడియా వాళ్ళు సార్ మీరు దేవున్ని ఏమని కోరుకున్నారు అని అడగగా.. మనశ్శాంతి అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్. అయితే ఈయన ఆన్సర్ విన్న చాలామంది షాక్ అయ్యారు.

ఇక ఆ తర్వాత అందరూ బాగుండాలని కోరుకున్నాను..సర్వేజనా సుఖినోభవంతు..అంటూ ఒక చిన్న చిరునవ్వుతో చెప్పారు. అయితే  ఎన్టీఆర్ మొదట్లో మనశ్శాంతి అనే మాట చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే అంత పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్ కి మనశ్శాంతి లేకపోవడం ఏంటి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆయన అలా సరదాకి అన్నారా.. లేక ఆయన లోపల ఉన్న బాధని బయట పెట్టారా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.. ఇక జూనియర్ ఎన్టీఆర్ మొహం చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తన తల్లి కోరికను తీర్చను అన్న సంతోషం ఎన్టీఆర్ మొహం లో ఏ కోణాన కూడా కనిపించడం లేదు.

ఏదో బయటికి అలా చిరునవ్వులు చిందిస్తున్నారు కానీ లోలోపల మాత్రం ఆయన మనసు ఎంతో వేదనను అనుభవిస్తున్నట్టు అర్థమవుతుంది.ఎందుకంటే తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకను గ్రాండ్గా జరిపిస్తున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ఎంతోమంది నటీనటులు హాజరవుతున్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.ఇక ఈ కారణం తోనే ఎన్టీఆర్ ఆ బాధని తన మనసులో పెట్టుకొని మనశ్శాంతి కోరుకుంటున్నానని మాట్లాడి ఉండవచ్చునని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ చెప్పిన మనశ్శాంతి అనే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>