PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/duvwada-srinivass-viral-controversy9c88214d-b2c2-4ce2-a2d4-dc5683eca0c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/duvwada-srinivass-viral-controversy9c88214d-b2c2-4ce2-a2d4-dc5683eca0c8-415x250-IndiaHerald.jpgగత నెల రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి, తన కూతుర్లను వదిలేసి... మాధురి చుట్టూ తిరుగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై తన భార్య దువ్వాడ వాణి నిరసనకు దిగింది. అయితే.. అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఎపిసోడ్ లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. శ్రీనివాస్, మాధురి వివాదంలో కొత్తకోణం బయటపడింది. duvvada srinivas{#}vani;Sucide;srinivas;Manam;Smart phone;Audio;Saturday;Car;Episode;Wife;Newsదువ్వాడ-మాధురి ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్.... వెలుగులోకి ఆడియో?దువ్వాడ-మాధురి ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్.... వెలుగులోకి ఆడియో?duvvada srinivas{#}vani;Sucide;srinivas;Manam;Smart phone;Audio;Saturday;Car;Episode;Wife;NewsSun, 01 Sep 2024 09:44:00 GMTగత నెల రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి, తన కూతుర్లను వదిలేసి... మాధురి చుట్టూ తిరుగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై తన భార్య దువ్వాడ వాణి నిరసనకు దిగింది. అయితే.. అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఎపిసోడ్ లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. శ్రీనివాస్, మాధురి వివాదంలో కొత్తకోణం బయటపడింది.


గత నెల 11వ తేదీన మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీనికి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కారణమంటూ, ఆమె వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి రోడ్డుపైకి అలా వెళ్లానని అప్పట్లో మాధురి ఆరోపణలు చేశారు. కానీ ఇదంతా దువ్వాడ శ్రీనివాస్ ఆడించిన డ్రామా అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్ వైరల్ అవుతుంది.


ప్రమాదం తర్వాత మాధురిని ఆంబులెన్స్ లో తరలిస్తుండగా ఆమెతో ఫోన్ లో మాట్లాడిన శ్రీనివాస్ తోలుత క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత కావాలనే కారుతో ఢీ కొట్టి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.... వాణి నాలుగు రోజుల నుంచి చేస్తున్న అరాచకాల వల్లే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు మీడియాకు చెప్పు అంటూ అతను మాధురికి సూచనలు చేశారు.


వైద్యులతో, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానంటూ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా శనివారం ఉదయం ఆడియో కాల్ లీక్ అయింది. ఇందులో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జరిపిన ఫోన్ కాల్ రికార్డు ఉంది. ఆ రోజు ప్రమాదం జరిగితే ఆ ఘటనను ఆత్మహత్యయత్నంగా ఎలా చిత్రీకరించారన్నది ఆ ఆడియోలో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. దీంతో మాధురి ఆత్మహత్యాయత్నం ఘటన అంతా డ్రామా అని తెలిసిపోయింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ ఆడియో విన్న జనాలు నవ్వుకుంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>