DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi5c810d41-f230-41c6-855a-e3ace74db2ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi5c810d41-f230-41c6-855a-e3ace74db2ae-415x250-IndiaHerald.jpgవరుసగా రెండు సార్లు అధికారంలో కొనసాగి… ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మళ్లీ గెలవడం చాల కష్టం. దీనిని సాధ్యం చేశారు నరేంద్రమోదీ. అయితే రెండు సార్లు కంటే మూడోసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారు. ఇప్పుడిక నాలుగో సారి కూడా మేమే అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మోదీ హస్తవాసి తగ్గిందనే అభిప్రాయం కొందరిలో ఉంది. వాస్తవానికి మూడో విడతలో 400 సీట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీయే కూటమి. కానీ 300 సీట్లు కూడా దాటలేకపోయింది. ఇప్పుడిక ఆయన గత రెండు విడతల్లో చేసిన పనులపై చర్చ మొదలైంది. ప్రధాని మోదీ చేతుల మmodi{#}Jagan;Amaravati;Gujarat - Gandhinagar;Narendra Modi;Capital;Prime Minister;Elections;June;Ayodhya;Chatrapathi Shivaji;Sivaji;raj;Driverఅమరావతి, అయోధ్య, శివాజీ విగ్రహం.. మోదీ హస్తవాసి సరిగా లేదా?అమరావతి, అయోధ్య, శివాజీ విగ్రహం.. మోదీ హస్తవాసి సరిగా లేదా?modi{#}Jagan;Amaravati;Gujarat - Gandhinagar;Narendra Modi;Capital;Prime Minister;Elections;June;Ayodhya;Chatrapathi Shivaji;Sivaji;raj;DriverSun, 01 Sep 2024 15:27:00 GMTవరుసగా రెండు సార్లు అధికారంలో కొనసాగి… ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మళ్లీ గెలవడం చాల కష్టం. దీనిని సాధ్యం చేశారు నరేంద్రమోదీ. అయితే రెండు సార్లు కంటే మూడోసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారు. ఇప్పుడిక నాలుగో సారి కూడా మేమే అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మోదీ హస్తవాసి తగ్గిందనే అభిప్రాయం కొందరిలో ఉంది.


వాస్తవానికి మూడో విడతలో 400 సీట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీయే కూటమి. కానీ 300 సీట్లు కూడా దాటలేకపోయింది. ఇప్పుడిక ఆయన గత రెండు విడతల్లో చేసిన పనులపై చర్చ మొదలైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా 2015లో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ప్రారంభం అయింది. కానీ 2015-19 మధ్య అమరావతి ఓ కొలిక్కి రాలేదు. వైఎస్ జగన్ వచ్చాక మూడు రాజధానులు పాటతో అమరావతి పూర్తిగా వెనక్కిపోయింది. ఇప్పుడు మూడో విడతలో దీని భవితవ్యం ఏం అవుతుందో చూడాలి.


శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం నిర్మాణం గత జనవరిలో నెరవేరింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన ప్రారంభోత్సవాన్ని పూర్తిగా మోదీ చేతులమీదుగానే నిర్వహించారు. బాల రాముడికి ఆయనే వస్త్రాలు సమర్పించారు. కానీ అయోధ్యలో భారీ వర్షాలతో గర్భగుడిలోకి నీరు వచ్చి చేరింది. అత్యంత ఘనంగా, అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయిన మందిరం పైకప్పు ఆరు నెలలకే చిల్లు పడింది.


ఇక మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఇది కూడా మోదీ చేతుల మీదుగానే ప్రారంభించడం గమనార్హం. అసలే శివాజీ మహారాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక. అందులోను అక్కడ రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో నష్టం జరగకుండా మోదీ శిరస్సు వంచి క్షమాపణలు కోరారు. కాగా మోదీ ప్రారంభించిన దిల్లీ పై కప్పు జూన్ నెలలో కుప్పకూలింది. ఒక ట్యాక్సీ డ్రైవర్ కూడా చనిపోయారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రాజ్ కోట్ శివారులో మోదీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. సంవత్సరం లోపే టెర్మినల్ ప్యాసింజర్ డ్రాప్ పికప్ ఏరియాలో భవనం పందిరిలో కొంత భాగం కూలిపోయింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>