Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6f7bac6e-0add-4b7a-b5e4-c9b8d0e6fde5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-6f7bac6e-0add-4b7a-b5e4-c9b8d0e6fde5-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వరల్డ్ క్రికెట్లో మిగతా ఫార్మాట్ తో పోల్చి చూస్తే టి20 ఫార్మాట్ కి ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఎందుకంటే మ్యాచ్ ఫలితం కోసం టెస్ట్ ఫార్మాట్ లో లాగా రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం.. వన్డే ఫార్మాట్లో లాగా ఇక ఒక రోజంతా మ్యాచ్ చూడాల్సిన అవసరం లేకపోవడం.. ప్రేక్షకులు అందరికీ కావాల్సిన బ్యాటింగ్ విధ్వంసం బౌలింగ్ వైవిద్యం ఫుల్లుగా టి20 ఫార్మాట్లో ఉంటాయి. అందుకే అటు టి20 ఫార్మాట్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ విధ్వంసానికి మారుపేరcricket {#}maya;Canada;Hong Kong;Mongolia;New Zealand;Panama;World Cup;ICC T20;Cricket;Parugu;Audienceఏంటి బాసూ.. మాయ చేసావా? మంత్రం వేసావా.. నాలుగు ఓవర్లు వేసి?ఏంటి బాసూ.. మాయ చేసావా? మంత్రం వేసావా.. నాలుగు ఓవర్లు వేసి?cricket {#}maya;Canada;Hong Kong;Mongolia;New Zealand;Panama;World Cup;ICC T20;Cricket;Parugu;AudienceSat, 31 Aug 2024 19:30:00 GMTఈ మధ్యకాలంలో వరల్డ్ క్రికెట్లో మిగతా ఫార్మాట్ తో పోల్చి చూస్తే టి20 ఫార్మాట్ కి ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఎందుకంటే మ్యాచ్ ఫలితం కోసం టెస్ట్ ఫార్మాట్ లో లాగా రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం.. వన్డే ఫార్మాట్లో లాగా ఇక ఒక రోజంతా మ్యాచ్ చూడాల్సిన అవసరం లేకపోవడం.. ప్రేక్షకులు అందరికీ కావాల్సిన బ్యాటింగ్ విధ్వంసం బౌలింగ్ వైవిద్యం ఫుల్లుగా టి20 ఫార్మాట్లో ఉంటాయి.


 అందుకే అటు టి20 ఫార్మాట్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్  విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. క్రీజు లోకి వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే మైండ్ సెట్ తో ఉంటాడు. అందుకే రావడం రావడమే మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్లు కొట్టడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న బ్యాట్స్మెన్ ను ఆపడం చాలా కష్టం అని చెప్పాలి. అందుకే ప్రతి బంతిని కూడా ఎంతో వైవిధ్యంగా సందించేందుకు బౌలర్లు కష్టపడుతూ ఉంటారు. కానీ చాలా మటుకు బౌలర్లు పరుగులను కట్టడి చేయడంలో విఫలమౌతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి టి20లలో ఇక్కడ ఒక బౌలర్ మాత్రం అద్భుతమే చేసి చూపించాడు.


 అతని బౌలింగ్ గణాంకాలు చూసి మాయ చేశాడా.. మంత్రం వేసాడా అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. హాంగ్కాంగ్ కు చెందిన ఆయుష్ శుక్ల ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే నాలుగు ఓవర్లు వేశాడు. మంగోలియా తో జరిగిన టి20 మ్యాచ్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. తద్వారా ఒకే మ్యాచ్లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడవ బౌలర్గా నిలిచాడు. 2024 t20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫేసెస్ పెర్క్యూసన్  PNG పై జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు అంతకు ముందు 2021లో కెనడా బౌలర్ సాద్విన్ జాఫర్ టి20 వరల్డ్ కప్ యూఎస్ క్వాలిఫైయర్ లో పనామా పై ఈ రికార్డు సాధించడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>