PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/praveen-kumarca5657ad-acf7-4d6d-aa3c-bbb413eb712b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/praveen-kumarca5657ad-acf7-4d6d-aa3c-bbb413eb712b-415x250-IndiaHerald.jpgరాజకీయ నాయకులు ఓ పార్టీ నుండి మరో పార్టీకి వెళ్లడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం పార్టీ మార్పులు అనేవి ఎన్నికల ముందు , ఆ తర్వాత జరుగుతూ ఉంటాయి. ఎన్నికల ముందు పార్టీ మారడానికి ప్రధాన కారణం కొంత కాలం పాటు ఓ పార్టీలో ఉండి ఆ పార్టీ సీటును ఆశించిన సమయంలో అతి దక్కనట్లు అయితే పక్కా పార్టీలోకి వెళ్లి సీటును దక్కించుకునే అవకాశం ఉన్నట్లు అయితే నాయకులు పార్టీని మారే అవకాశం ఉంటుంది. ఇక ఎలక్షన్ల తర్వాత వారు ఉన్న పార్టీ కనుక అధికారంలో లేనట్లయితే అధికారం ఉన్న పార్టీలోకి నాయకులు వెళ్లే అవకాశం Praveen kumar{#}praveen;Kurnool;December;March;India;Parliment;Assembly;Telangana Rashtra Samithi TRS;Telangana Chief Minister;Telangana;Congress;Huzur Nagar;రాజీనామా;Partyఅధికారంలో లేకపోయిన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. కానీ ఇక్కడ జరిగింది అదే..?అధికారంలో లేకపోయిన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. కానీ ఇక్కడ జరిగింది అదే..?Praveen kumar{#}praveen;Kurnool;December;March;India;Parliment;Assembly;Telangana Rashtra Samithi TRS;Telangana Chief Minister;Telangana;Congress;Huzur Nagar;రాజీనామా;PartyFri, 30 Aug 2024 08:48:00 GMTరాజకీయ నాయకులు ఓ పార్టీ నుండి మరో పార్టీకి వెళ్లడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం పార్టీ మార్పులు అనేవి ఎన్నికల ముందు , ఆ తర్వాత జరుగుతూ ఉంటాయి. ఎన్నికల ముందు పార్టీ మారడానికి ప్రధాన కారణం కొంత కాలం పాటు ఓ పార్టీలో ఉండి ఆ పార్టీ సీటును ఆశించిన సమయంలో అతి దక్కనట్లు అయితే పక్కా పార్టీలోకి వెళ్లి సీటును దక్కించుకునే అవకాశం ఉన్నట్లు అయితే నాయకులు పార్టీని మారే అవకాశం ఉంటుంది. ఇక ఎలక్షన్ల తర్వాత వారు ఉన్న పార్టీ కనుక అధికారంలో లేనట్లయితే అధికారం ఉన్న పార్టీలోకి నాయకులు వెళ్లే అవకాశం ఉంటుంది.

అలాగే మరికొన్ని సందర్భాలలో ఇతర కారణాల వల్ల కూడా నాయకులు పార్టీలు మారే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ పార్టీలోకి కొంత మంది నాయకులు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు. ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ) కార్యదర్శి గా ( 2013 - 20 జూలై 2021) వరకు ప్రవీణ్ కుమార్ పని చేశారు. ఆ తర్వాత ఈయన రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఈయన 2021 ఆగస్టు 8 లో బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరాడు. ఇకపోతే 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈయన బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు.

కానీ ఆ ఎన్నికలలో ఈయన ఓడిపోయాడు. ఆర్‌ ఎస్  ప్రవీణ్‌ కుమార్‌ 2024 మార్చి 16 న బహుజన్‌ సమాజ్‌ పార్టీకి రాజీనామా చేశాడు. ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఇక ఈయన 2024 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాగర్ కర్నూలు నుండి పోటీ చేశాడు. కానీ అందులో ఈయన ఓడిపోయాడు. ప్రస్తుతం ఈయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>