PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naralakesh5f1b9cb3-8c9c-476a-acd5-745658dbb448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naralakesh5f1b9cb3-8c9c-476a-acd5-745658dbb448-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది.మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ, నిరుద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ప్రతి ఏడాది 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పింnaralakesh{#}Nara Lokesh;Capital;Industries;Vishakapatnam;Telangana Chief Minister;Minister;Government;thursdayలోకేష్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదే మా లక్ష్యం..!లోకేష్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదే మా లక్ష్యం..!naralakesh{#}Nara Lokesh;Capital;Industries;Vishakapatnam;Telangana Chief Minister;Minister;Government;thursdayFri, 30 Aug 2024 11:15:00 GMTరాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది.మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ, నిరుద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ప్రతి ఏడాది 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరులల్లో అమలుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో ఐటి, ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయని వివరించారు. దేశంలో టాప్‌ -10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారని తెలిపారు. ఐఎస్‌బి తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని, ఎఐ హబ్‌గా కూడా విశాఖను తీర్చిదిద్దుతామని, రోబోటిక్స్‌, హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగవంతంగా అభివృద్ధిచేస్తామని చెప్పారు. రాబోయే అయిదేళ్లలో విశాఖపట్నాన్ని 100 బిలియన్‌ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.విశాఖపట్నం పై మా ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉంది రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలోఅందుబాటుల్లో 90% విశాఖపట్నం కే రాబోతున్నాయి. విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటిలో మాత్రమే కాకుండా ఫార్మా ఎం ఎస్ ఎం ఈ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది.అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. విశాఖను ఐటీ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం. రెండు కళ్ళల భావిస్తూ ముందుకు సాగుతోంది. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విశాలవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటీ స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటీ పరిశ్రమకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదు అని నారా లోకేష్ వెల్లడించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>