MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala12ce2565-a451-4412-8e4c-d6260a34055e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala12ce2565-a451-4412-8e4c-d6260a34055e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఆ తర్వాత ఈయన ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ తో మంచి విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని కొరటాల ఏర్పరుచుకున్నాడు. ఇకపోతే కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... కKoratala{#}Saif Ali Khan;Jr NTR;koratala siva;Mirchi;Interview;Music;Prabhas;NTR;Telugu;september;Cinema"జనతా గ్యారేజ్" కి జరిగింది "దేవర" కు జరగదు.. కొరటాల..?"జనతా గ్యారేజ్" కి జరిగింది "దేవర" కు జరగదు.. కొరటాల..?Koratala{#}Saif Ali Khan;Jr NTR;koratala siva;Mirchi;Interview;Music;Prabhas;NTR;Telugu;september;CinemaFri, 30 Aug 2024 11:58:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఆ తర్వాత ఈయన ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ తో మంచి విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని కొరటాల ఏర్పరుచుకున్నాడు. ఇకపోతే కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ అనే మూవీ ని తెరకెక్కించాను. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఆ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అభిమానులే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఎందుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు. కానీ ఆ తర్వాత సినిమా పికప్ అయ్యి బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద విజయం అందుకుంది అని ఆయన అన్నారు. ఇకపోతే ప్రస్తుతం కొరటాల జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఈ సినిమాకు జనతా గ్యారేజ్ కి జరిగిన సంఘటన జరగకుండా చూసుకుంటాను అని ఈ మూవీ విడుదల అయిన మొదటి షో నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇకపోతే దేవర సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ మూవీ మొదటి భాగంపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>