SportsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoniua4766a3a-25e9-40d6-84f7-31b4aa200a62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoniua4766a3a-25e9-40d6-84f7-31b4aa200a62-415x250-IndiaHerald.jpgభాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే ఆట క్రికెట్. అటువంటి క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పినా ఆయన్ని కోట్ల మంది అభిమానులు మర్చిపోలేదు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోని అంటే తమిళనాడు ప్రజలకు ఎంతో ఇష్టం. ధోనీకి కూడా తమిళనాడు ప్రజలంటే చాలా స్పెషల్ అని చెప్పాలి. తాజాగా ఓ తమిళ్ స్టార్ హీరో కూడా తన చేతిపై ధోని పేరును టాటూ వేయించుకున్నాdhoniu{#}MS Dhoni;Swati;arvind swamy;deva;prem;swathi;Tamilnadu;96;Chennai;kiran;Hero;Tamil;Success;Music;Audience;Director;Cinemaఆ స్టార్‌ హీరో చేతిపై టాటూగా ధోనీ పేరుఆ స్టార్‌ హీరో చేతిపై టాటూగా ధోనీ పేరుdhoniu{#}MS Dhoni;Swati;arvind swamy;deva;prem;swathi;Tamilnadu;96;Chennai;kiran;Hero;Tamil;Success;Music;Audience;Director;CinemaFri, 30 Aug 2024 15:00:00 GMTభాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే ఆట క్రికెట్. అటువంటి క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పినా ఆయన్ని కోట్ల మంది అభిమానులు మర్చిపోలేదు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోని అంటే తమిళనాడు ప్రజలకు ఎంతో ఇష్టం. ధోనీకి కూడా తమిళనాడు ప్రజలంటే చాలా స్పెషల్ అని చెప్పాలి. తాజాగా ఓ తమిళ్ స్టార్ హీరో కూడా తన చేతిపై ధోని పేరును టాటూ వేయించుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో హిట్ అందుకుంటోన్న హీరో కార్తి. త్వరలోనే ఆయన మెయ్యళగన్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీలో తమిళ్ సీనియర్ స్టార్ నటుడు అరవింద్ స్వామి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ఫ్యాన్స్ అంటున్నారు. 96 మూవీతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ మెయ్యళగన్ మూవీ షూటింగ్‌ను వేగంగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీలో ధోనీకి వీరాభిమానిగా కార్తీ కనిపిస్తారట. అందుకే సినిమాలో భాగంగా ఆయన తన చేతిపై ధోని పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ధోనీ ఫ్యాన్స్‌తో పాటుగా కార్తీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సూర్య, జ్యోతికలు కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీలో శ్రీదివ్య, స్వాతి కొండే, దేవ దర్శిని, జయప్రకాష్‌, రాజ్‌ కిరణ్ వంటివారు నటిస్తున్నారు. గోవింద్‌ వసంత సంగీతం ఈ మూవీకి మరింత ప్లస్ కానుంది. ఈ మూవీని సెప్టెంబర్‌ చివరి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి త్వరలోనే ట్రైలర్ రానున్నట్లు మేకర్స్ తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>