Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan0f0a2d70-380a-4edf-83e4-e2f42daad8ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan0f0a2d70-380a-4edf-83e4-e2f42daad8ef-415x250-IndiaHerald.jpgఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను చేస్తూ తమ మూవీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమందిలో అటు సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శంకర్ కూడా ఒకరు అని చెప్పాలి. ఆయన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. కాగా గత కొంతకాలం నుంచి మాత్రం ఎందుకో శంకర్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న భారీ అంచనాల మధ్య లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్Charan{#}Ram Charan Teja;Bharateeyudu;Industry;Indian;Audience;vetrimaran;shankar;GEUM;December;Cinemaచరణ్ 'గేమ్ చేంజర్' మూవీకి కొత్త గండం.. ఆ సినిమా కూడా?చరణ్ 'గేమ్ చేంజర్' మూవీకి కొత్త గండం.. ఆ సినిమా కూడా?Charan{#}Ram Charan Teja;Bharateeyudu;Industry;Indian;Audience;vetrimaran;shankar;GEUM;December;CinemaFri, 30 Aug 2024 11:00:00 GMTఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను చేస్తూ తమ మూవీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమందిలో అటు సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శంకర్ కూడా ఒకరు అని చెప్పాలి. ఆయన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. కాగా గత కొంతకాలం నుంచి మాత్రం ఎందుకో శంకర్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న భారీ అంచనాల మధ్య లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన భారతీయుడు 2సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది.


 అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పైనే అందరికల్లు ఉన్నాయి. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే భారతీయుడు 2 తో ఫ్లాప్ చూసిన శంకర్.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్  విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేని సమయంలో గేమ్ చేంజర్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే పక్కా హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.


 కాగా గేమ్ చేంజర్  సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఓ గండం పొంచి ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇదే రోజున వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై 2 సినిమా విడుదల కాబోతుంది. పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయితే.. చరణ్ గేమ్ చేంజర్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని.. సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>