DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganfda69464-f32a-48c6-8616-bc772638e8c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganfda69464-f32a-48c6-8616-bc772638e8c2-415x250-IndiaHerald.jpgఅధికారంలో ఉన్నవాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదలిపోతున్నారు. పెద్ద పెద్దనేతలే పార్టీని వదిలి వెళ్తున్నప్పుడు ఇక కింది స్థాయి నేతల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే ప్రస్తుతం మేయర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీలు, వివిధ సంస్థల ఛైర్మన్లు కూడా ఐదేళ్లు అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ అసలు ఏరికోరి పదవులు ఇచ్చిన వాళ్లే కష్టాల్లో కాడిని వదిలjagan{#}Venkatroshaiah Kilari;Pothula Suneetha;Nani;Mopidevi Venkata Ramana;రాజీనామా;AdiNarayanaReddy;Jagan;YCP;TDP;MLA;Air;Partyఇలాంటి వారికా నేను పదవులు ఇచ్చింది, తెగ బాధపడుతున్న జగన్?ఇలాంటి వారికా నేను పదవులు ఇచ్చింది, తెగ బాధపడుతున్న జగన్?jagan{#}Venkatroshaiah Kilari;Pothula Suneetha;Nani;Mopidevi Venkata Ramana;రాజీనామా;AdiNarayanaReddy;Jagan;YCP;TDP;MLA;Air;PartyFri, 30 Aug 2024 13:12:28 GMTఅధికారంలో ఉన్నవాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదలిపోతున్నారు. పెద్ద పెద్దనేతలే పార్టీని వదిలి వెళ్తున్నప్పుడు ఇక కింది స్థాయి నేతల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే ప్రస్తుతం  మేయర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారడం సర్వసాధారణం అయిపోయింది.


అలాగే సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీలు, వివిధ సంస్థల ఛైర్మన్లు కూడా ఐదేళ్లు అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ అసలు ఏరికోరి పదవులు ఇచ్చిన వాళ్లే కష్టాల్లో కాడిని వదిలేసి వెళ్లడం నిజంగా జగన్ ఎంపిక చేసుకున్న లోపమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ విధేయత, తన పట్ల నమ్మకం ఉన్న వారిని పక్కన పెట్టి మరీ పదవులు ఇచ్చి ఇప్పుడు వారిని అనుకొని ఏం లాభం అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.


నిజానికి కిలారి రోశయ్య ఎమ్మెల్యే అయ్యారంటే అది జగన్ చలవే. ఎందుకంటే జగన్ 2019లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే కిలారి రోశయ్య అసలు రాజకీయాల్లోకి వచ్చే వారే కాదు. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్.. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడం.  ఉమ్మారెడ్డి ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉండటంతో ఆయన ముఖం చూసి కిలారికి జగన్ టికెట్ ఇచ్చారు. అలాగే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలవలేదన్నది నిజం. ఫ్యాన్ గాలి వీయడంతో ఆయన గెలిచారు.


ఇప్పుడు ఆయన పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ కి అర్థం అయి ఉండాలి. అలాగే అన్ని పదవులు ఇచ్చిన ఆళ్ల నాని కూడా అంతే. ఇక మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల నాని పార్టీ నుంచి వైదొలిగారు. గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఊకడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్సీ పదవినే తిరిగి ఇచ్చారు. పోతుల సునీత కూడా అంతే. టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చినా ఎమ్మెల్సీ పదవి ఆమెకే తిరిగి ఇచ్చారు. బీద మస్తాన్ రావు, పెందెం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే.  ఇలా పార్టీ మారి పదవులు పొందిన వారే తిరిగి మళ్లీ వెళ్లిపోతున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>