SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gyanendra-pandeya192d79f-01e3-4d72-aa7d-258c9d8d1d55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gyanendra-pandeya192d79f-01e3-4d72-aa7d-258c9d8d1d55-415x250-IndiaHerald.jpgటీమిండియాలో చాలా మందే క్రికెటర్లు ఉన్నారు. అందులో ఒకడు భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్రకుమార్ కేదార్ నాథ్ పాండే. అయితే పాండే గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. చాలాకాలం నుంచి బయటకు రాని ఈ ఆల్ రౌండర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 52 ఏళ్ల మాజీ క్రికెటర్ ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు. Gyanendra Pandey{#}Kumaar;jayanth;Pakistan;SBI;BCCI;you tube;INTERNATIONAL;March;Cricket;Indiaబీసీసీఐ కుట్రలు... బ్యాంకు ఉద్యోగిగా మిగిలిపోయిన టీమిండియా ప్లేయర్!బీసీసీఐ కుట్రలు... బ్యాంకు ఉద్యోగిగా మిగిలిపోయిన టీమిండియా ప్లేయర్!Gyanendra Pandey{#}Kumaar;jayanth;Pakistan;SBI;BCCI;you tube;INTERNATIONAL;March;Cricket;IndiaFri, 30 Aug 2024 11:29:00 GMTటీమిండియాలో చాలా మందే క్రికెటర్లు ఉన్నారు. అందులో ఒకడు భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్రకుమార్ కేదార్ నాథ్ పాండే. అయితే పాండే గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. చాలాకాలం నుంచి బయటకు రాని ఈ ఆల్ రౌండర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 52 ఏళ్ల మాజీ క్రికెటర్ ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు.


మార్చి 24, 1999లో పెప్సీ కప్ ట్రై-సిరీస్ లో భాగంగా ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు జ్ఞానేంద్ర కుమార్.  స్పిన్ ఆల్ రౌండర్ అయిన జ్ఞానేంద్ర టీమిండియాలో సెటిల్ అవుతాడని అందరూ ఊహించారు. ఆ సమయంలో భారత జట్టులో ఆల్ రౌండర్లకు కొరత ఉండేది. దీంతో ఆ స్థానాన్ని జ్ఞానేంద్ర కుమార్ భర్తీ చేస్తాడని అందరూ అనుకుంటే.... రెండు వన్డేలకే అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది.


అదే పాకిస్తాన్ తో మొహాలీలో వారం తర్వాత ఆడిన రెండో మ్యాచ్ అతడికి లాస్ట్ మ్యాచ్ గా నిలిచింది. ఆ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా జ్ఞానేంద్ర కుమార్ కు కుదరలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 117 మ్యాచుల్లో కలిపి 5348 పరుగులు చేసిన జ్ఞానేంద్ర 165 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 82 మ్యాచుల్లో 1781 పరుగులు చేసి....89 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మరిన్ని అవకాశాలు ఇస్తే జ్ఞానేంద్ర తప్పక రాణించేవాడేమో కానీ సెలెక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు.

డొమెస్టిక్ క్రికెట్ లో ఎంత రాణించినా.... ఆరేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన అతడిని తిరిగి నేషనల్ టీం లోకి తీసుకోలేదు. దీంతో జ్ఞానేంద్ర క్రికెట్ కెరీర్ పై ఆశలు వదులుకున్నాడు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఆర్ ఏజెంట్ గా జ్ఞానేంద్ర పనిచేస్తున్నాడు. అప్పటి బీసీసీఐ సెక్రటరీ జయంత్ లేలే నుంచి జ్ఞానేంద్రకు సపోర్ట్ లేకపోవడంతో తాను ఇలా ఉండిపోయానని....లేకపోతే తన కెరియర్ వేరేలా ఉండేదని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞానేంద్రకుమార్ వాపోయాడు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>