MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svscce17fa32-06db-4fe8-b92c-08bca39adb5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svscce17fa32-06db-4fe8-b92c-08bca39adb5d-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మల్టీ స్టారర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట శ్రీకాంత్ అడ్డాల అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్నాడట. మరి అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్న సినిమాలోకి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఎలా వచ్చారు. ఈ మూవీ ఎలా సెట్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నిర్మాత అయినటు వంటి దిల్ రాజు ఆ ఇంటర్Svsc{#}anjali;srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;Manam;Venkatesh;mahesh babu;srikanth;Samantha;Interview;dil raju;producer;Producer;Cinemaవెంకీ లేకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమానే లేదు.. అసలేం జరిగిందో తెలుసా..?వెంకీ లేకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమానే లేదు.. అసలేం జరిగిందో తెలుసా..?Svsc{#}anjali;srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;Manam;Venkatesh;mahesh babu;srikanth;Samantha;Interview;dil raju;producer;Producer;CinemaThu, 29 Aug 2024 14:18:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మల్టీ స్టారర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట శ్రీకాంత్ అడ్డాల అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్నాడట. మరి అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్న సినిమాలోకి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఎలా వచ్చారు. ఈ మూవీ ఎలా సెట్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నిర్మాత అయినటు వంటి దిల్ రాజు ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా సెట్ కావడానికి అందులోకి వెంకటేష్ , మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు రావడానికి గల కారణాలను తెలియజేశాడు.

దిల్ రాజు మాట్లాడుతూ ... కొత్త బంగారులోకం సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమాకు సంబంధించిన లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. ఎవరితో చేయాలి అనుకుంటున్నావు అని అన్నాను. అంతా కొత్త వాళ్ళతో చేయాలి అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఇది కొత్త వాళ్ళతో సెట్ కాదు స్టార్ హీరోలు అయితే బాగుంటుంది అని అన్నాను. దానితో వెంటనే ఆయన వెంకటేష్ గారికి ఈ కథ తెలుసు. నేను ఆయనతో చాలా రోజులుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు అని శ్రీకాంత్ అన్నాడు.

దానితో వెంటనే నేను ఓకే మనం మరో స్టార్ హీరోని వెతుకుదాం అన్నాను. అనుకోకుండా మహేష్ బాబు ను ఒక రోజు కలిసాను. ఈ సినిమా కథ గురించి చెప్పాను. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలమూవీ కథను మహేష్ కు వినిపించాడు. అది ఆయన అద్భుతంగా నచ్చడంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సెట్ అయినట్లు దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా అంజలి నటించగా ,  మహేష్ బాబు కు జోడిగా సమంత నటించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>