PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/brsedcaee8b-5f0e-4a38-975c-ce235588c7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/brsedcaee8b-5f0e-4a38-975c-ce235588c7a7-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేక ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీని స్థాపించిన మొదట్లో కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పెద్ద పెద్ద పార్టీలతో పోటీ పడ్డాడు. పార్టీని ప్రారంభించిన మొదటి దశలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం , కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఆ పార్టీల పోటీని తట్టుకొని మరి టిఆర్ఎస్ పార్టీ నిలబడింది. ఇక కెసిఆర్ అనేక సార్లు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి Brs{#}Telugu Desam Party;Thota Chandrasekhar;Revanth Reddy;Assembly;KCR;Telangana;KTR;Parliment;Hanu Raghavapudi;Telangana Chief Minister;Party;Congressతెలుగు రాజకీయం.. ప్రతిపక్షం సంక్షోభం : బీఆర్ఎస్.. ఎంతమంది ఉన్నా భారం వారి పైనే..?తెలుగు రాజకీయం.. ప్రతిపక్షం సంక్షోభం : బీఆర్ఎస్.. ఎంతమంది ఉన్నా భారం వారి పైనే..?Brs{#}Telugu Desam Party;Thota Chandrasekhar;Revanth Reddy;Assembly;KCR;Telangana;KTR;Parliment;Hanu Raghavapudi;Telangana Chief Minister;Party;CongressThu, 29 Aug 2024 08:58:00 GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేక ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీని స్థాపించిన మొదట్లో కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పెద్ద పెద్ద పార్టీలతో పోటీ పడ్డాడు. పార్టీని ప్రారంభించిన మొదటి దశలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం , కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఆ పార్టీల పోటీని తట్టుకొని మరి టిఆర్ఎస్ పార్టీ నిలబడింది. ఇక కెసిఆర్ అనేక సార్లు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాడు. ఇక 2009 వ సంవత్సరం నుండి ఈ ఉద్యమం ఉదృతమయింది.

ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజల నుండి అద్భుతమైన స్థాయిలో సపోర్ట్ వచ్చింది. దానితో కేంద్రం 2014 వ సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి దానితో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో కెసిఆర్ రెండవ సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2023 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఒక్క సారిగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు భారీగా తగ్గిపోయాయి. ఇక చూస్తే 2024 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క పర్లమెట్ సీటు కూడా రాలేదు.

దానితో ఈ పార్టీ మనుగడ ఎటు వైపు వెళుతుందా అనే అనుమానం కూడా చాలా మం దిలో వ్యక్తం అవుతూ వచ్చింది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది నేతలు ఉన్నా కూడా భారం అంతా ఓ ఇద్దరిపైనే పడింది. కేసీఆర్ మొదటి నుండి కూడా ఓటమి తర్వాత ఎక్కువగా జనాల్లో తిరగడం లేదు. బయటికి కూడా ఎక్కువ రావడం లేదు. దానితో కేటీఆర్ , హరీష్ రావు మాత్రమే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపై తమదైన స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. దానితో వీరిద్దరే బీఆర్ఎస్ పార్టీ భారాన్నంతా మోస్తూ వస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>