SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/champions-trophyd56b6d93-adf4-42b9-88db-7e5b19782ae0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/champions-trophyd56b6d93-adf4-42b9-88db-7e5b19782ae0-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా ఈ డిసెంబర్ లో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేయడానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో జై షా రేసులో నిలవడంతో మరెవరో పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. champions trophy{#}central government;February;BCCI;Pakistan;tuesday;November;Cricket;Decemberఐసీసీ చైర్మన్ గా జై షా...పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు....?ఐసీసీ చైర్మన్ గా జై షా...పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు....?champions trophy{#}central government;February;BCCI;Pakistan;tuesday;November;Cricket;DecemberThu, 29 Aug 2024 17:43:00 GMTఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా ఈ డిసెంబర్ లో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేయడానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో జై షా రేసులో నిలవడంతో మరెవరో పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు.


దాంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్రను సృష్టించారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనకు ఈ అత్యున్నత పదవి వరించింది. ఐసీసీ చైర్మన్గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. అయితే ఇప్పుడు జై షా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని విజయవంతంగా నిర్వహించడం జై షాకు అతిపెద్ద సవాల్ గా మారింది.


బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్తాన్ కు పంపించేందుకు నిరాకరించిన జై షా ఇప్పుడు అలా దూకుడుగా వ్యవహరించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వాలి. ఏది ఏమైనా ఐసీసీ అధికార పీఠం ఇప్పుడూ జైశా చేతుల్లోకి వెళ్ళింది. కాబట్టి ఇది పాకిస్థాన్ కు పెద్ద సమస్యగా మారింది.

డిసెంబర్ 1, 2024 నుంచి జై షా అధ్యక్షుడిగా ఉండనున్నారు. ఛాంపి యన్స్ ట్రో ఫీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది పాకిస్తాన్ కు ఇబ్బందిగా మారడం ఖాయం అంటున్నారు. ఇకపై పాకి స్తాన్ ఆటలు సాగవని... ఛాంపియ న్స్ ట్రో ఫీ కోసం పాకిస్తాన్ ఇండియాకు వెళ్ళకుండా జై షా స్కెచ్ వేస్తారని పలువురు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>