PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-rajinama-anantaram-keelaka-prakatana-chesina-mopideviead802cb-baf6-4993-b20a-8669344d47fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-rajinama-anantaram-keelaka-prakatana-chesina-mopideviead802cb-baf6-4993-b20a-8669344d47fd-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లలో విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్‌ నిరాశ, నిస్పఅహలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో వైపు పార్టీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వలసలు కొనసాగడం ప్రస్తుత రాజకీయాల్లో పరిపాటిగా మారింది.mopidevivenkataramana{#}Beeda Masthan Rao;రాజీనామా;Mopidevi Venkata Ramana;Rajya Sabha;MP;Janasena;TDP;Journey;CBN;Andhra Pradesh;Party;Jagan;YCPఏపీ: రాజీనామా అనంతరం కీలక ప్రకటన చేసిన మోపిదేవి..!ఏపీ: రాజీనామా అనంతరం కీలక ప్రకటన చేసిన మోపిదేవి..!mopidevivenkataramana{#}Beeda Masthan Rao;రాజీనామా;Mopidevi Venkata Ramana;Rajya Sabha;MP;Janasena;TDP;Journey;CBN;Andhra Pradesh;Party;Jagan;YCPThu, 29 Aug 2024 12:45:22 GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లలో విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్‌ నిరాశ, నిస్పఅహలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో వైపు పార్టీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వలసలు కొనసాగడం ప్రస్తుత రాజకీయాల్లో పరిపాటిగా మారింది. 2014-19 వరకు వైసిపి లోంచి టిడిపిలోకి, 2019-24 వరకు టిడిపి లోంచి వైసిపిలోకి నాయకుల వలసలు కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ వైసిపి వంతు వచ్చింది... ఈసారి ఒక్క టిడిపిలోకే కాదు జనసేన పార్టీలోకి కూడా నాయకులు జంప్ అవుతున్నారు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో కౌన్సిలర్ల, కార్పోరేటర్లతో ప్రారంభమైన వలసలు తాజాగా ఉపందుకుని ఎంపీలు,ఎమ్మెల్సీలకు చేరుకున్నారు. త్వరలోనే వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.తాజాగా రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొంత కాలంగా నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇదిలా ఉండగా తన రాజీనామా పై ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు.నా రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అన్ని బయటకు చెప్పుకోలేను. ప్రస్తుతానికి నేను,బీద మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నాం. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు మొన్న టికెట్ ఇవ్వనప్పుడే మనస్తాపం చెందా.పార్టీకి ద్రోహం చేయకూడదనే అప్పుడు రాజీనామా చేయలేదు అని ఆయన అన్నారు.ఈరోజు ఉదయం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. 

అధికారులు తనకేమి కొత్త కాదని మోపిదేవి వెంకటరమణ అన్నారు. జగన్ తో జర్నీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి,ఆ నిర్ణయానికి అనుగుణంగా టిడిపికి లోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టిడిపి తో కలిసి జర్నీ చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి పార్టీ మారుతున్నానని,కానీ అధికారం కోసం కాదన్నారు. జగన్ కు తనకి బేధాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే వైసిపికి ముందుముందు ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు వైసిపిలోంచి చేరికలపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. వైసిపిలోంచి టిడిపిలో చేరాలనుకునే ఏ నాయకుడైనా ఆ పార్టీ సభ్యత్వానికే కాదు పదవికి కూడా రాజీనామా చేయాలనే కండిషన్ పెట్టారు. అంటే వైసిపి నాయకులను చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్దంగా వున్నారని... వైసిపి వాళ్లు కూడా ఆయనతో టచ్ లో వున్నారనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు గేట్లెత్తారు కాబట్టి ఇకపై వైసిపిలోంచి భారీ వలసలు వుంటాయని టిడిపి నాయకులు చెబుతున్నారు.ఈ నేపథ్యం లోనే వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేసారు.వైసిపి సభ్యత్వంలో పాటు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసారు.రాజ్యసభ ఛైర్మన్ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్న వీరిద్దరు రాజీనామా సమర్పించారు.అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూడా రాజీనామా లేఖను పంపించనున్నట్లు సమాచారం. ఇక వీరద్దరు కూడా టిడిపి గూటికి చేరనున్నారని... ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>