MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bvb07ee924-d120-4692-933d-ffb0c2ee1db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bvb07ee924-d120-4692-933d-ffb0c2ee1db6-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితమే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మురారి సినిమాను అత్యంత భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇక ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు. అలాగే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మాస్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. రీ రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్లు బాగానే వస్తున్Bv{#}Chiranjeevi;Akkineni Nagarjuna;indra;kalyan;mahesh babu;Blockbuster hit;Gabbar Singh;Bunny Vas;Murari;Mass;Telugu;Cinemaఇంద్ర రీ రిలీస్ కోసం అంత పెద్ద త్యాగం చేసిన బన్నీ వాసు..?ఇంద్ర రీ రిలీస్ కోసం అంత పెద్ద త్యాగం చేసిన బన్నీ వాసు..?Bv{#}Chiranjeevi;Akkineni Nagarjuna;indra;kalyan;mahesh babu;Blockbuster hit;Gabbar Singh;Bunny Vas;Murari;Mass;Telugu;CinemaThu, 29 Aug 2024 10:12:00 GMTఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితమే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మురారి సినిమాను అత్యంత భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇక ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు. అలాగే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మాస్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. రీ రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.

కానీ ఈ సినిమాల సమయంలో విడుదల అయిన కొత్త సినిమాలపై రీ రిలీజ్ ల ఏఫెక్ట్ భారీగా పడుతుంది. కొన్ని రీ రిలీజ్ సినిమాల ద్వారా కొత్త సినల కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బన్నీ వాసు నిర్మించిన ఆయ్ అనే సినిమా థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో నడుస్తున్న సమయంలోనే చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ అయింది.

దానితో తాజాగా బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనకు ఇంద్ర సినిమా రీ రిలీస్ ద్వారా ఆయ్ మూవీ కలెక్షన్ల పై ఏమైనా ఎఫెక్ట్ పడిందా ... మీరేమైనా నష్టపోయారా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. దీనితో ఆయన స్పందిస్తూ ... చిరంజీవి గారి సినిమా రీ రిలీస్ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు. ఒక రోజు దేవి థియేటర్లో ఒక షో అడిగారు ఇచ్చేసాను. ఆయన సినిమా కోసం లాభనష్టాలు ఆలోచించే స్థాయికి నేను ఎదగలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు అని ఆయన సమాధానం ఇచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>