PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-chandrababu-ap87978a47-abf8-4a3e-bfc4-019fdc3bf45d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-chandrababu-ap87978a47-abf8-4a3e-bfc4-019fdc3bf45d-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల ముందు కూటమిగా అటు బిజెపి జనసేన పార్టీలు అలైన్స్ ని పెట్టుకున్నాయి. దీంతో ఏపీలో అయితే భారీ విజయాన్ని అందుకుంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి అధికారాన్ని అందుకున్నారు. ఐదేళ్లపాటు కేంద్రంలో మోడీ హవ మళ్లీ కొనసాగుతుంది.అయితే 2029 ఎన్నికలలో రాజు ఎవరనే విషయం మాత్రం ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి, ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు పోటాపోటీ గానే కొనసాగింది. బిజెపి పార్టీ సొంతంగా 240 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాబట్టి మిగతా సీట్లను అటు టిడిపి జెడిఏ వంటి పార్టీలMODI;CHANDRABABU;AP{#}mithra;Jammu and Kashmir - Srinagar/Jammu;Narendra Modi;Capital;king;CBN;polavaram;Polavaram Project;MP;Andhra Pradesh;Bharatiya Janata Party;TDP;Parlimentమోదీతో జత.. సిఎం చంద్రబాబుకు ఇబ్బందులా..?మోదీతో జత.. సిఎం చంద్రబాబుకు ఇబ్బందులా..?MODI;CHANDRABABU;AP{#}mithra;Jammu and Kashmir - Srinagar/Jammu;Narendra Modi;Capital;king;CBN;polavaram;Polavaram Project;MP;Andhra Pradesh;Bharatiya Janata Party;TDP;ParlimentThu, 29 Aug 2024 08:45:00 GMT2024 ఎన్నికల ముందు కూటమిగా అటు బిజెపి జనసేన పార్టీలు అలైన్స్ ని పెట్టుకున్నాయి. దీంతో ఏపీలో అయితే భారీ విజయాన్ని అందుకుంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి అధికారాన్ని అందుకున్నారు. ఐదేళ్లపాటు కేంద్రంలో మోడీ హవ మళ్లీ కొనసాగుతుంది.అయితే 2029 ఎన్నికలలో రాజు ఎవరనే విషయం మాత్రం ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి, ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు  పోటాపోటీ గానే కొనసాగింది.


బిజెపి పార్టీ సొంతంగా 240 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాబట్టి మిగతా సీట్లను అటు టిడిపి జెడిఏ వంటి పార్టీలు సపోర్టుగా నిలిచి అండగా నిలబడ్డాయి. అయితే రెండున్నర నెలలు తిరగకుండా అని ఇప్పుడు బిజెపి పార్టీకి సపోర్టు లభిస్తోంది. అదే పెద్దల సభలో బిజెపికి బలం ఒక్కసారిగా పెరిగిపోయడం జరిగింది. బిజెపికి మిత్రులతో కలిపి ఏకంగా 119 సీట్లు దాకా బలం పెరిగిందట. దీంతో మ్యాజిక్ ఫిగర్ ని సైతం దాటేసినట్లు తెలుస్తోంది.. మరో ఎనిమిది ఖాళీలు మాత్రమే ఉన్నాయి ఇందులో నామినేటెడ్ గా భర్తీ అయ్యేవి కూడా బిజెపి ఖాతాలోకి వస్తాయట.


కాశ్మీర్ ఎన్నికల తర్వాత మరో నాలుగు సీట్లు వస్తాయని దీంతో రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ దొరుకుతుంది. దీంతో తన బలాన్ని మరొకసారి నిరూపించుకోబోతోంది బీజేపీ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును సైతం ప్రస్తుతం సంయుక్త పార్లమెంట్ కమిటీలోకి వచ్చినప్పటికీ రేపటి రోజున దానిని తిరిగి ప్రవేశపెట్టడానికి సైతం కచ్చితంగా బిజెపి పార్టీ ప్రయత్నిస్తుంది.. మెజారిటీ బిల్లును కూడా ఉభయసభలలో పెట్టి ఆమోదించడానికి ప్లాన్ చేస్తాందట.


ఈ రెండు బిల్లులే కాకుండా..ఒక కామన్ సివిల్ కోడ్ అనే బిల్లును కూడా తీసుకురాబోతోందట బిజెపి. మోదీ ఇలా అన్నిట్లో దూసుకుపోతూ ఉంటే ఏపీ నుంచి అగ్రస్థానంలో మిత్రపక్షంతో ఉన్న టిడిపి పరిస్థితి ఇప్పుడు ఏంటా అని చర్చ మొదలయింది. ముఖ్యంగా మైనార్టీల విషయంలో వారి విధివిధానాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.. 2029 అధికారంలో బిజెపి వస్తుందో రాదు తెలియదు కాబట్టి వారు అనుకున్న పనులన్నీ ఇప్పుడే నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న మిత్ర పార్టీల మద్దతు కోరుకుంటుంది. మరి ఆ విధంగా ఇవ్వడానికి జెడియు, టిడిపి కానీ సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. ఏపీలో కూటమి చూస్తే రాజధాని నిర్మాణ, పోలవరం తోపాటు కేంద్రం నుంచి నిధులు రావాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామని  ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు. మరి వీటిని ఎంతవరకు ఏపీ సీఎం చంద్రబాబు రాబట్టగలరని విషయం సందిగ్ధంగా మిగిలింది. కానీ రాజ్యసభలో బిజెపికి బలం పెరగడంతో మిత్రపక్షాలకి కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>