PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-rajasekhar96a90c7c-542e-4b1a-9cbd-306da34eeb1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-rajasekhar96a90c7c-542e-4b1a-9cbd-306da34eeb1f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీని ముఖ్యంగా చిరంజీవిని ఎవరు విమర్శించినా అభిమానులు అస్సలు ఊరుకోరు. సాధారణంగా చిరంజీవి ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. చీమకు సైతం అపకారం చేయని హీరోగా చిరంజీవికి పేరుంది. ఠాగూర్ సినిమా రైట్స్ వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైందని చాలామంది ఫీలవుతారు. chiranjeevi rajasekhar{#}dr rajasekhar;jeevitha rajaseskhar;Prajarajyam Party;Yevaru;Industry;Chiranjeevi;Allu Arjun;Allu Aravind;Cinema;Tollywoodమెగా ఫ్యామిలీ జీవిత రాజశేఖర్ మధ్య వివాదానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే గొడవ పెద్దదైందా?మెగా ఫ్యామిలీ జీవిత రాజశేఖర్ మధ్య వివాదానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే గొడవ పెద్దదైందా?chiranjeevi rajasekhar{#}dr rajasekhar;jeevitha rajaseskhar;Prajarajyam Party;Yevaru;Industry;Chiranjeevi;Allu Arjun;Allu Aravind;Cinema;TollywoodWed, 28 Aug 2024 09:32:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీని ముఖ్యంగా చిరంజీవిని ఎవరు విమర్శించినా అభిమానులు అస్సలు ఊరుకోరు. సాధారణంగా చిరంజీవి ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. చీమకు సైతం అపకారం చేయని హీరోగా చిరంజీవికి పేరుంది. ఠాగూర్ సినిమా రైట్స్ వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైందని చాలామంది ఫీలవుతారు.
 
ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్ మంచి స్నేహితులు కాగా ఎవరైనా సరే గొప్ప అని ఫోజు కొడితే నాకు అస్సలు నచ్చదని అందుకనే చిరంజీవిపై కోపమని రాజశేఖర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. విచిత్రం ఏంటంటే అల్లు అరవింద్ కుటుంబంతో జీవిత కుటుంబానికి దూరపు చుట్టరికం ఉంది.
 
చిరంజీవి ప్రవర్తన నచ్చక ఆయనతో విబేధించామని రాజశేఖర్ ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ జీవిత రాజశేఖర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజశేఖర్ పై నెగిటివిటీ పెరిగేలా కొన్ని దుష్ప్రచారాలు జరగడం మెగా ఫ్యామిలీనే ఆ దుష్ప్రచారాలు చేసిందని రాజశేఖర్ భావించడం వల్ల కూడా గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది.
 
అయితే ఇండస్ట్రీ అంటే చిన్నచిన్న సమస్యలు సాధారణం అని అందరు హీరోలు కలిసి ఉంటే మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య వివాదం కూడా పరిష్కారమైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. చిరంజీవి ఆరు పదుల వయస్సులో సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>