Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-kangra-ranaut-c88e8121-b980-41c4-9414-85ae6fde053b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-news-about-kangra-ranaut-c88e8121-b980-41c4-9414-85ae6fde053b-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు పొలిటికల్ కు కాంట్రవర్సీలలో ఇరుక్కుంటున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండి.. ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలలో ఇరుకుంటుంటే ఇంకొంతమంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పొలిటికల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న వారిలో అటు బాలీవుడ్ నటి బిజెపి ఎంపీ కన్నడ రనౌత్ కూడా ఒకరు అని చెప్పాలి. ఈమెను బాలీవుడ్ క్వీన్ అని పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక రాజకీయాల్లో మాత్Kangana{#}Queen;Bangladesh;Kannada;Kangana Ranaut;bollywood;Bharatiya Janata Party;Government;Partyవివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా.. చివరికి సొంత పార్టీనే షాకిచ్చిందిగా?వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా.. చివరికి సొంత పార్టీనే షాకిచ్చిందిగా?Kangana{#}Queen;Bangladesh;Kannada;Kangana Ranaut;bollywood;Bharatiya Janata Party;Government;PartyWed, 28 Aug 2024 09:45:00 GMTఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు పొలిటికల్ కు కాంట్రవర్సీలలో ఇరుక్కుంటున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండి.. ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలలో ఇరుకుంటుంటే ఇంకొంతమంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పొలిటికల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న వారిలో అటు బాలీవుడ్ నటి బిజెపి ఎంపీ కన్నడ రనౌత్ కూడా ఒకరు అని చెప్పాలి. ఈమెను బాలీవుడ్ క్వీన్ అని పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు.


 ఇక రాజకీయాల్లో మాత్రం కంగనాను కాంట్రవర్షియల్ క్వీన్ అని అంటూ ఉంటారు ప్రత్యర్ధులు. ఎందుకంటే ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక విధంగా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది కంగానా. అయితే ఇటీవల రైతుల నిరసనలపై కంగనా  చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిజెపి తీసుకువచ్చిన సాగు చట్టాలపై రైతులు చేసిన నిరసన వెనక విదేశీ కుట్ర ఉందని.. అంతేకాకుండా ఈ నిరసనల్లో ఎన్నో హత్యలు అత్యాచారాలు కూడా జరిగాయి అంటూ కంగడా వ్యాఖ్యానించింది. ఒకవేళ తమ ప్రభుత్వం ముందుచూపుతో ఉండకపోయి ఉంటే ఇండియాలో కూడా బంగ్లాదేశ్ తరహా  పరిస్థితులు నెలకొనేవి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.


 అయితే కంగానా వ్యాఖ్యలపై అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తి పోసాయి అని చెప్పాలి. అయితే ఇలా రైతుల జోలికి వెళ్లి రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగానాకు  సొంత పార్టీ నుంచి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమె చేసిన వ్యాఖ్యలను బిజెపి తప్పి పట్టింది. పార్టీ విధానం పై ప్రకటన చేసేందుకు కంగానాకు ఎలాంటి అధికారం లేదు అంటూ స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు కేవలం ఆమె సొంత అభిప్రాయం మాత్రమే అంటూ తేల్చి చెప్పింది. ఇక ఆమె వ్యాఖ్యలకు తాము బాధ్యత వహించబోము అంటూ తెలిపింది. ఇలా రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చివరికి పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరుక్కున్న కంగనాకు సొంత పార్టీ నుంచి షాక్ తగిలింది అని చెప్పాలి. ఈ ఒక్కటేమిటి ఇప్పటివరకు కంగనా తన జీవితంలో ఎన్నో వివాదాలు ఇరుక్కుంది. మొన్నటికి మొన్న తన దగ్గరికి సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు.. ఆధార్ కార్డులు తీసుకురావాలని వ్యాఖ్యానించి మరోసారి కాంట్రవర్సీస్ సృష్టించింది. ఇలా కంగన ఏం మాట్లాడినా కూడా అదొక పెద్ద కాంట్రవర్సీగానే మారిపోతూ ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>