Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hatfik168577ee-7709-45cb-8288-1bdf976fbaee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hatfik168577ee-7709-45cb-8288-1bdf976fbaee-415x250-IndiaHerald.jpgక్రికెటర్లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అంటే ఆ రేంజ్ లో పిచ్చి ఉంది. స్టార్ క్రికెటర్లను దేవుని లాగా ఆరాధిస్తూ ఉంటారు ఎంతో మంది క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్యా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్Hatfik{#}Nataša Stanković;World Cup;natasha;Hardik Pandya;Mumbai;Instagram;Love;Wife;Cricket;premaవిడాకుల తర్వాత.. ప్రేమపై నటాషా మొదటి పోస్ట్.. వైరల్?విడాకుల తర్వాత.. ప్రేమపై నటాషా మొదటి పోస్ట్.. వైరల్?Hatfik{#}Nataša Stanković;World Cup;natasha;Hardik Pandya;Mumbai;Instagram;Love;Wife;Cricket;premaTue, 27 Aug 2024 18:15:00 GMTక్రికెటర్లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అంటే ఆ రేంజ్ లో పిచ్చి ఉంది. స్టార్ క్రికెటర్లను దేవుని లాగా ఆరాధిస్తూ ఉంటారు ఎంతో మంది క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్యా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు.



 ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ కు ముందు ఏకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడంతో రోహిత్ ఫ్యాన్స్ అందరు కూడా అతన్ని ట్రోలింగ్ చేశారు. దీంతో వార్తల్లో నిలిచాడు. ఇక ఆ తర్వాత ముంబై జట్టు కెప్టెన్ గా ఆటగాడిగా విఫలం కావడంతో విమర్శలు ఎదుర్కొని వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఇక వరల్డ్ కప్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకుని వార్తల్లో నిలిచాడు. ఇక ఆ తర్వాత తన భార్య నటాషాతో విడాకుల వ్యవహారం కారణంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక విడాకుల తర్వాత ఒకవైపు హార్దిక్ పాండ్యా ఇంకోవైపు అతని భార్య నటాషా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా అది వైరల్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి.


 అయితే హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత అతని మాజీ భార్యని నటాషా కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు వెళ్ళిపోయింది. ఇక అక్కడే కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇటీవలే ఆమె ప్రేమ గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ ఎంతో దయగలది. ప్రేమలో ద్వేషం అసూయ ఉండవు. స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పులను లెక్కిస్తూ ఎప్పటికీ కోపం ప్రదర్శించదు. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది దేని కోసం పెట్టారు అనే విషయంపై చర్చ జరుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>