PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-raghurama-right-for-this-position-has-babu-fixed-ita744052e-a45a-480c-903e-3e93332d15fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-raghurama-right-for-this-position-has-babu-fixed-ita744052e-a45a-480c-903e-3e93332d15fc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు టీడీపీలో ఎదురు చెప్పే నేత కానీ కార్యకర్త కానీ దాదాపుగా లేరనే సంగతి తెలిసిందే. అయితే గతంలో వైసీపీ తరపున ఎంపీగా పని చేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ మాత్రం అప్పుడప్పుడూ తన మార్క్ షాకులిస్తూ టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. రఘురామకు చంద్రబాబు మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ ఇస్తారనిఅందరూ భావించినా ఆ విధంగా జరగలేదు. raghurama krishnamraju{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Andhra Pradesh;Assembly;Jagan;TDP;Government;politics;Party;YCP;CBN;mediaచంద్రబాబుకు తన మార్క్ షాకులిస్తున్న రఘురామ.. పార్టీ ఏదైనా రఘురామ మారడుగా!చంద్రబాబుకు తన మార్క్ షాకులిస్తున్న రఘురామ.. పార్టీ ఏదైనా రఘురామ మారడుగా!raghurama krishnamraju{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Andhra Pradesh;Assembly;Jagan;TDP;Government;politics;Party;YCP;CBN;mediaTue, 27 Aug 2024 08:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు టీడీపీలో ఎదురు చెప్పే నేత కానీ కార్యకర్త కానీ దాదాపుగా లేరనే సంగతి తెలిసిందే. అయితే గతంలో వైసీపీ తరపున ఎంపీగా పని చేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ మాత్రం అప్పుడప్పుడూ తన మార్క్ షాకులిస్తూ టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. రఘురామకు చంద్రబాబు మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ ఇస్తారనిఅందరూ భావించినా ఆ విధంగా జరగలేదు.
 
అసెంబ్లీ సమావేశాల సమయంలో రఘురామ కృష్ణంరాజు జగన్ ను కలిసి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ సమయంలో నెటిజన్లు పార్టీ ఏదైనా రఘురామ మారడుగా అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయ్యాయి. కొన్నిసార్లు మాత్రం రఘురామ బాబుకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిందని బాబు నాయకత్వంలో ఏపీ ముందుకు వెళ్తుందని రఘురామ కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
అయితే రాబోయే రోజుల్లో రఘురామ చంద్రబాబుకు షాకులిచ్చే పనులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రఘురామ కృష్ణంరాజు తీరు ఇతర నేతలకు భిన్నమని తనకు అన్యాయం జరుగుతుందని భావిస్తే ఈ నేత అస్సలు సహించరని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు చుక్కలు చూపించిన రఘురామ జగన్ తో అసెంబ్లీలో మాట్లాడటం చూసి కూటమి నేతలు ముక్కున వేలేసుకున్నారు.
 
ఏపీలో ఎన్నికలకు మరో 4.5 సంవత్సరాల సమయం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రఘురామ కృష్ణంరాజు కూటమికి పక్కలో బల్లెంలా తయారయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రఘురామ కృష్ణంరాజు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం కొసమెరుపు. అయితే రఘురామ కృష్ణంరాజు భవిష్యత్తులో టీడీపీకి దూరమైనా చేరడానికి మరో పార్టీ అయితే లేకపోవడంతో ఆయన రాజకీయాలు అంతకు చిక్కని విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>