MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu4ff1275c-fa68-41c9-b985-6be0cb06ddd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu4ff1275c-fa68-41c9-b985-6be0cb06ddd4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకోసం మహేష్ ఆల్రెడీ తన మేకోవర్ ని మార్చుకోవడం మొదలు పెట్టారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ mahesh babu{#}Red chilly powder;Hollywood;RRR Movie;mahesh babu;India;Industry;Chitram;september;News;Rajamouli;Hero;Cinema;Director;Indianమరింత ఆలస్యంగా మహేష్, రాజమౌళి సినిమా.. ఎందుకంటే..!?మరింత ఆలస్యంగా మహేష్, రాజమౌళి సినిమా.. ఎందుకంటే..!?mahesh babu{#}Red chilly powder;Hollywood;RRR Movie;mahesh babu;India;Industry;Chitram;september;News;Rajamouli;Hero;Cinema;Director;IndianTue, 27 Aug 2024 12:25:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.  ఇందుకోసం మహేష్ ఆల్రెడీ తన మేకోవర్ ని మార్చుకోవడం మొదలు పెట్టారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ చిత్రం ఉండబోతోంది.  మహేష్ చివరి చిత్రం గుంటూరు కారం రిలీజ్

 అయి చాలా కాలం గడుస్తోంది. అయినా ఇంతవరకు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించలేదు. ఆగష్టులో అంటూ ఊహాగానాలు వచ్చాయి. సెప్టెంబర్ కూడా వచ్చేస్తోంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.  అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో, ఇదిగో అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు ఊరిస్తూ వస్తున్నాయి. కానీ డిలే అవడానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు. 

గతంలో దర్శకధీరుడు రాజమౌళి కొన్ని హాలీవుడ్ సంస్థలతో టై అప్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది హాలీవుడ్ యాక్టర్స్‌ను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయడం కోసమని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో కూడా ఓ హాలీవుడ్ సంస్థ భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం జక్కన్న హాలీవుడ్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందనే చెప్పాలి.మహేష్ తో రాజమౌళి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాదాపు పదేళ్ల కితమే లాక్ చేయబడిందే అని తెలుస్తుంది. అది కూడా రాజమౌళి మైండ్ లో ఎప్పుడు నుంచో ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గరుడ” నే ఈ సినిమా అన్నట్టుగా టాక్. ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>