Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-pakkalo-ballemla-marina-ganta-vyavahram-15f6f78e-9e47-49c0-bcad-75fb3fcadd3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-pakkalo-ballemla-marina-ganta-vyavahram-15f6f78e-9e47-49c0-bcad-75fb3fcadd3c-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్ర రాజకీయాలలో గంటా శ్రీనివాసరావు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చక్రం తిప్పారు..ఆయన వరుస విజయాలు అయనపై పోటీ చేసే నాయకులను టెన్సన్ పెడుతుంది..1999లో రాజకీయ రంగప్రవేశం చేసిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు.అనంతరం 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 10 వేల మెజారిటీతో విజయం సాధించారు.. 2009లో తన అభిమాన నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చ#ganta srinivasrao{#}Lokesh;GANTA SRINIVASA RAO;BOTCHA SATYANARAYANA;Rajya Sabha;Anakapalle;Vishakapatnam;Lokesh Kanagaraj;Prajarajyam Party;Bheemili;Chakram;రాజీనామా;Ishtam;February;Letter;Congress;Andhra Pradesh;TDP;CBN;January;Chiranjeevi;MLA;Minister;Partyటీడీపీకి పక్కలో బల్లెంలా మారిన గంటా వ్యవహారం.. మంత్రి పదవికోసమేనా ఆ హడావుడి..?టీడీపీకి పక్కలో బల్లెంలా మారిన గంటా వ్యవహారం.. మంత్రి పదవికోసమేనా ఆ హడావుడి..?#ganta srinivasrao{#}Lokesh;GANTA SRINIVASA RAO;BOTCHA SATYANARAYANA;Rajya Sabha;Anakapalle;Vishakapatnam;Lokesh Kanagaraj;Prajarajyam Party;Bheemili;Chakram;రాజీనామా;Ishtam;February;Letter;Congress;Andhra Pradesh;TDP;CBN;January;Chiranjeevi;MLA;Minister;PartyTue, 27 Aug 2024 09:11:02 GMT

* చంద్రబాబుకి తలనొప్పిగా మారిన గంటా వ్యవహారం

* అనవసరపు హడావుడి సృష్టిస్తున్న గంటా..

* తీసి పక్కన పడేస్తున్న లోకేష్..



తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గంటా శ్రీనివాసరావు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చక్రం తిప్పారు..ఆయన వరుస విజయాలు అయనపై పోటీ చేసే నాయకులను టెన్సన్ పెడుతుంది..1999లో రాజకీయ రంగప్రవేశం చేసిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు.అనంతరం 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 10 వేల మెజారిటీతో విజయం సాధించారు.. 2009లో తన అభిమాన నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో గంటా ఆ పార్టీలో చేరారు.ఆ ఏడాది అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా కాంగ్రెస్ అభ్యర్ధి కొణతాల రామకృష్ణపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఇష్టం లేకుండానే గంటా కాంగ్రెస్ లో చేరారు.


 నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రిగా కూడా చేసారు..2014లో రాష్ఠ్ర విభజన తరువాత గంటా తిరిగి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో  విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి.. శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో విద్యా శాఖ మంత్రిగా పని చేసారు. 2019లో మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదించాలని అప్పట్లో గంటా స్పీకర్ కు లేఖ రాసారు.. కానీ స్పీకర్ ఆ విషయం పట్టించుకోలేదు..



 అయితే రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ బలం తగ్గించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న వైసీపీకి గంటా రాజీనామా ఆయుధంలా దొరికింది. దీనితో ఆయన రాజీనామాను 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించారు.దానిపై గంటా న్యాయ పోరాటం కూడా చేసారు..అయితే ఉత్తరాంధ్రలో బలమైన కాపు సామాజిక నేతగా గంటా కి మంచి పట్టు ఉంది . తన రాజకీయ జీవితంలో  4 సార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గంటాను బొత్స కు ప్రత్యర్దిగా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావించింది. కానీ గంటా అందుకు అంగీకరించకపోవడంతో భీమిలి సీటు విషయం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ భీమిలి సీటు ఇవ్వకుంటే గంటా పార్టీ మారతారని ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.. దీనితో టీడీపీ భీమిలి సీటు గంటాకే అప్పగించింది.


అనుకున్నట్టుగానే కూటమి అనూహ్య విజయం సాధించింది. భీమిలి నుంచి గంటా భారీ మెజారిటీతో విజయం సాధించారు. మంత్రి పదవి కోసం చూస్తున్న గంటాకు ఆదిలోనే షాక్ తగిలింది..సీనియర్ నేతలు ఎవరికీ మంత్రి పదవులు రాలేదు. పార్టీలో కష్టపడిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని లోకేష్ పట్టుబట్టారు.. దీనితో గంటాకు మంత్రి పదవి రాలేదు..ఎలాగైనా మంత్రి పదవి అందుకోవాలని గంటా అనవసరపు హడావుడి మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయిన గెలిపిస్తాను అంటూ అనవసరపు హడావుడి చేసారు.. అయితే ఆ ఎమ్మెల్సీ స్థానం పోటీకి టీడీపీ దూరంగా ఉంది.. ఎలాగైనా మంత్రి పదవి తెచ్చుకునేందుకు పార్టీలో కుదుపులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం.. మరి గంటా అనుకున్నది సాధిస్తారో లేదో చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>