PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp29906c78-d013-478c-905b-80f683773e28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp29906c78-d013-478c-905b-80f683773e28-415x250-IndiaHerald.jpg ఇలాంటి వారిలో ఏలూరు మేయర్ నూర్జహాన్ ... ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముందు వరుసలో ఉంటారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నూర్జహాన్ - పెదబాబు దంపతులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీరికి పదవులు ఇచ్చి పెద్ద పీఠ వేశారు. నూర్జహాన్ కు ఏలూరు మేయర్ పీఠం కట్టబెట్టారు .. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి ఆ పదవి అనుభవించిన ఈ దంపతులు 2019 ఎన్నికల ముందు కండువాలు మార్చేశారు.. వైసిపి గూటికి వెళ్లిపోయారు. ycp{#}chanti;Badeti Bujji;Eluru;Husband;YCP;Government;Hanu Raghavapudi;Telugu Desam Party;TDP;Party;Indiaఆ వైసీపీ దంప‌తులు టీడీపీలోకి... స్వార్థంతోనే అంటూ టీడీపీ గ‌గ్గోలు..?ఆ వైసీపీ దంప‌తులు టీడీపీలోకి... స్వార్థంతోనే అంటూ టీడీపీ గ‌గ్గోలు..?ycp{#}chanti;Badeti Bujji;Eluru;Husband;YCP;Government;Hanu Raghavapudi;Telugu Desam Party;TDP;Party;IndiaMon, 26 Aug 2024 12:42:13 GMT
- టీడీపీ లోకి ఏలూరు మేయ‌ర్ నూర్జ‌హాన్ దంప‌తులు .. .

- ( ఏలూరు - ఇండియా హెరాల్డ్ ) .

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జంపింగ్ జపాంగ్ ల గోల‌ ఎక్కువైంది. ఈ క్రమంలోనే కొందరు రాజకీయంగా తమ స్వార్థం కోసం కండువాలు మారుస్తున్నారు. ఇలాంటి వారిలో ఏలూరు మేయర్ నూర్జహాన్ ... ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముందు వరుసలో ఉంటారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నూర్జహాన్ - పెదబాబు దంపతులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీరికి పదవులు ఇచ్చి పెద్ద పీఠ వేశారు. నూర్జహాన్ కు ఏలూరు మేయర్ పీఠం కట్టబెట్టారు .. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి ఆ పదవి అనుభవించిన ఈ దంపతులు 2019 ఎన్నికల ముందు కండువాలు మార్చేశారు.. వైసిపి గూటికి వెళ్లిపోయారు.


నూర్జహాన్ దంపతులు చివర్లో పార్టీ మారడంతో అప్పుడు టిడిపి నుంచి పోటీ చేసిన బడేటి బుజ్జి కేవలం 3,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఐదేళ్లపాటు వైసీపీలో అధికారంలో ఉన్నారు.. అక్కడ కూడా మేయ‌రు పదవి తీసుకున్నారు .. అలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి అక్కడ పదవులు అనుభవించి ఇప్పుడు మళ్ళీ టిడిపి అధికారంలో ఉండడంతో ఆ పార్టీలోకి జంప్‌ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అయిన ఈ విషయాన్ని ఎందుకు గ్రహించటం లేదో అర్థం కావడం లేదు. గతంలో తెలుగుదేశం లో పదవులు అనుభవించి తమ అన్న బుజ్జి ఓటమికి కారణమైన నూర్జహాన్ - పెదబాబు దంపతులను ఈరోజు చంటి టిడిపిలో చేర్చుకోవటాన్ని నియోజకవర్గ టిడిపి శ్రేణులు ... తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.


ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వారి అవసరం కోసం రాజకీయం చేసేవాళ్లను టిడిపి నాయకులు పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ... తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాపోతున్న పరిస్థితి. అయినా పార్టీ నాయకుల మాత్రం అవేవీ పట్టించుకోకుండా తమ స్వార్ధ రాజకీయాలకు అనుగుణంగా జంపింగ్ నేతలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ... ఇలాంటి చర్యలు వల్లే పార్టీ నష్టపోవటం ఖాయం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>