MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------bfa7935d-341d-46f3-92a5-d9f4df003856-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------bfa7935d-341d-46f3-92a5-d9f4df003856-415x250-IndiaHerald.jpgచాలా మంది సినీ స్టార్స్ తమ ఫ్యామిలీ గురించి చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు. తమ పిల్లల వివరాలు చెప్పకుండా దాటవేస్తుంటారు. తీరా ఒకానొకరోజు పెళ్లీడుకొచ్చిన తమ కొడుకును, కూతుర్ని పరిచయం చేస్తూ ఫ్యాన్స్‌కు షాకిస్తుంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విషయంలో కూడా అలానే జరిగింది. కిచ్చా సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు బాగా తెలిసిన హీరోనే. ఈయనకు శాండల్ వుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్రలో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఆ తర్వాత మోస్ట్ పవర్కిచ్చా సుదీప్{#}Sudeep;shanvi;sye-raa-narasimha-reddy;Eega;Sanvi Srivatsava;Ram Gopal Varma;Saira Narasimhareddy;Darsakudu;Girl;Chiranjeevi;Prabhas;Priya;Hero;marriage;Telugu;Kannada;Cinema;Directorఆ స్టార్ హీరోకు అంత పెద్ద కూతురుందని తెలుసా?ఆ స్టార్ హీరోకు అంత పెద్ద కూతురుందని తెలుసా?కిచ్చా సుదీప్{#}Sudeep;shanvi;sye-raa-narasimha-reddy;Eega;Sanvi Srivatsava;Ram Gopal Varma;Saira Narasimhareddy;Darsakudu;Girl;Chiranjeevi;Prabhas;Priya;Hero;marriage;Telugu;Kannada;Cinema;DirectorMon, 26 Aug 2024 11:06:00 GMTచాలా మంది సినీ స్టార్స్ తమ ఫ్యామిలీ గురించి చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు. తమ పిల్లల వివరాలు చెప్పకుండా దాటవేస్తుంటారు. తీరా  ఒకానొకరోజు పెళ్లీడుకొచ్చిన తమ కొడుకును, కూతుర్ని పరిచయం చేస్తూ ఫ్యాన్స్‌కు షాకిస్తుంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విషయంలో కూడా అలానే జరిగింది. కిచ్చా సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు బాగా తెలిసిన హీరోనే. ఈయనకు శాండల్ వుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్రలో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఆ తర్వాత మోస్ట్ పవర్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ఈగ మూవీలో విలన్‌గా చేసి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.

ఈగ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, ప్రభాస్ బాహుబలి లాంటి మూవీస్‌లో స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో 1997 నుంచి కొనసాగుతున్న సుదీప్ ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాడు. తన సినిమాలన్నీ కూడా అక్కడి ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూనే ఉంది. ఇక కిచ్చా సుదీప్ ఫ్యామిలీ వివరాలకు వస్తే.. ప్రియా అనే అమ్మాయిని సుదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికొక కూతురు కూడా ఉంది. సుదీప్ కూతురంటే పదేళ్ల అమ్మాయి అనుకునేరు. ఆయన కూతురికి ఇప్పుడు 20 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు.

కిచ్చా సుదీప్ కూతురు పేరు శాన్వి సుదీప్. ఆమెకు 20 ఏళ్లు ఉంటే సుదీప్‌కు వయసెంత ఉంటుందని అందరికీ అనుమానం ఉంటుంది కదా. ప్రస్తుతం సుదీప్ వయసు 52 ఏళ్లు. ఇంత వయసులో కూడా సుదీప్ యంగ్‌గానే కనిపిస్తారు. ఇక శాన్వి సుదీప్ ప్రస్తుతం చదువుకుంటూనే సింగర్‌గా రాణిస్తోంది. పాటలు పాడటం అంటే శాన్వికి చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే సింగర్‌గా ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. తన పేరెంట్స్ ఫోటోలను శాన్వి నెట్టింట పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఏదేమైనా సుదీప్‌కు అంత పెద్ద కూతురు ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>